ఏలూరు మాజీ ఎంపీ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాగంటి బాబు కుమారుడు రామ్ జీ అలియాస్ రామ చంద్రన్ ఆత్మహత్యకు ప్రయత్నించినట్టు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ విష్యం మీద ఎలాంటి క్లారిటీ లభించలేదు. అయితే ఆయన తాజాగా మృతి చెందినట్టు తెలుస్తోంది. కొద్ది సేపటి క్రితమే ఆయన ఆసుపత్రిలో తుదిశ్వాస విదిచింట్టు చెబుతున్నారు.
దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. నిజానికి ఆయన నిద్రమాత్రలు మింగి సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించాడని దీంతో వెంటనే ఆయనని కుటుంబ సభ్యులు హుటాహుటిన విజయవాడ ఆంధ్రా హాస్పిటల్ కి తరలించారని ప్రచారం జరిగింది. అయన తల్లితండ్రులు లేదా పార్టీ దీనికి సంబందించిన ప్రకటన చేయాల్సి ఉంది.