ఇద్దరి మధ్య బంధం బాగుండాలంటే కావాల్సిన లక్షణాలు..

-

బంధం.. ఇద్దరి మనుషుల మధ్య దూరాన్ని తగ్గించేవి బంధాలే. అలాగే ఇద్దరి మధ్య దూరాలని పెంచేవి కూడా బంధాలే. అవును, బంధం బాగుంటే అది చాలా అందంగా ఉండి, మంచి మంచి అనుభూతులని ఇస్తుంది. లేదంటే ప్రతీ చిన్న విషయం కూడా గునపంలా మారి చికాకు పెట్టిస్తుంది. ఆరోగ్యకరమైన బంధం ఉంటే అంతకుమించిన ఆనందం ఉండదు. ఐతే ఒక బంధం బాగుండాలన్నా, చెడిపోవాలన్నా దానికి ఇద్దరూ కారకులవుతారు. చాలా కొద్ది విషయాల్లో మాత్రమే ఒక్కరి వల్లే బంధం చెడిపోతుంది.

ఆరోగ్యకరమైన బంధానికి ఆరు సూత్రాలేంటో ఇక్కడ తెలుసుకుందాం

కమ్యూనికేషన్

ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోతే ఏ బంధమైనా ఎక్కువ రోజులు నిలవదు. నిలవడం దాకా ఎందుకు, అసలు బంధమే ఏర్పడదు. కమ్యూనికేషన్ అంటే కేవలం మాటలు మాత్రమే అనుకుంటారు చాలా మంది. కానీ అది కాదు. మీరు చెబుతున్న విషయం అవతలి వారికి సరిగ్గా అర్థం అవుతుందా లేదా అనేదే కమ్యూనికేషన్.

సమయం

మీతోటి వారికి సరైన సమయం ఇస్తేనే వారితో మీ బంధం నిలబడుతుంది. మీకు కావాల్సిన పనులు చేసుకుంటూనే అవతలి వారికి సమయాన్ని ఇవ్వాలి. అవతలి వారితో ఉండేందుకు మీకు సమయమే లేనపుడు మీరెంత సంపాదించినా ఆ బంధం నిలబడదు.

ఇచ్చి పుచ్చుకోవడాలు

ఏదైనా అవసరం ఉంటే మీరు ఇవ్వడం, తీసుకోవడం అనేది ఉంటేనే బంధం పెరుగుతుంది. ఇచ్చిపుచ్చుకోవడాలు బంధాన్ని ఇంకా పెంచుతాయి.

హెచ్చుతగ్గులకి రెడీగా ఉండాలి

ఇద్దరి మధ్య స్నేహం ఉన్నప్పుడు హెచ్చుతగ్గులు కామన్ గా ఉంటాయి. వాటికి ఎల్లప్పుడూ రెడీగా ఉండాలి. ఎప్పుడూ ఒకేలా ఉంటుందని అస్సలు అనుకోవద్దు. హెచ్చుతగ్గులకి రెడీగా లేకపోతే బంధాలు శాశ్వతంగా దూరమయ్యే ఛాన్స్ ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news