ఆంధ్రప్రదేశ్ లో పదవ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలను కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు. ఈ ఫలితాలను మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేశారు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. అధికారులతో కలిసి ఈ ఫలితాలను విడుదల చేశారు. ఈసారి 6,22,537 మంది పదో తరగతి పరీక్షలు రాశారు. ఈసారి విడుదలైన ఫలితాల్లో 4.14 లక్షల మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.64.01శాతంగా ఉత్తీర్ణత నమోదయింది.
ఈసారి కూడా బాలికలే పైచేయి సాధించారు 78.3 శాతం ఉత్తీర్ణతతో ప్రకాశం జిల్లా టాప్ గా నిలిచింది. అనంతపురం జిల్లా ఉత్తీర్ణత శాతం లో చివరి స్థానంలో నిలిచింది. అమ్మాయిల్లో 70 శాతానికి పైగా ఉత్తీర్ణులయ్యారు. కాగా ఈ ఫలితాలను జూన్ 4వ తేదీన ఉదయం 11 గంటలకు రాష్ట్ర విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి రాజశేఖర్ విడుదల చేయాల్సి ఉంది. అయితే కొన్ని అనివార్య కారణాలతో ఈ ఫలితాలను విడుదల చేయలేక పోయినట్లు డైరెక్టర్ పేర్కొన్నారు.