ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరు గా కొనసాగుతున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఇక కృష్ణ కుమారుడు గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి ఎన్నో సినిమాలలో నటించి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్నారు. రాజకుమారుడు చిత్రంతో ఎంట్రీ ఇచ్చి.. ఇప్పటివరకు ఎన్నో చిత్రాలలో నటించాడు. దేశంలోనే మోస్ట్ డిజైరబుల్ యాక్టర్గా పేరు పొందాడు. ఇక తాజాగా సర్కారు వారి పట్ల చిత్రంతో కూడా మరొక బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్నాడు.ఫోర్డ్స్ మ్యాగజైన్ లో డిజైర్ బుల్ మ్యాన్ గా కేవలం సౌత్ ఇండియాలో మహేష్ బాబు కి ఆ రికార్డు దక్కింది. ఏకంగా 8 నంది అవార్డులను కూడా మహేష్ బాబు తన తీసుకునే రెమ్యూనరేషన్ లో 20 శాతం వరకు అనాధ పిల్లలకు సహాయం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. హిల్ ఫౌండేషన్ ద్వారా చిన్న పిల్లలకు క్యాన్సర్ బాధితులకు ఉచిత ఆపరేషన్ చేయిస్తున్నాడు మహేష్ బాబు. ఇక శ్రీమంతుడు సినిమా ద్వారా రెండు గ్రామాలను దత్తత తీసుకుని వారికి కావలసిన సౌకర్యాలను కూడా కల్పిస్తే ఉన్నాడు.
మహేష్ బాబు హీరోయిన్ నమ్రత ని ప్రేమించి వివాహం చేసుకున్నారు ఇక వీరిద్దరి కి గాను సితార, గౌతమ్ పిల్లలు కలరు.మహేష్ బాబుకు జూబ్లీహిల్స్ లో రూ.28 కోట్ల విలువ చేసే ఒక లగ్జరీ ఇల్లు ఉన్నది. మహేష్ బాబు ఒక్కో చిత్రానికి రూ.48 కోట్లు తీసుకుంటున్నట్లు టాక్. మహేష్ దగ్గర ఐదు ఖరీదైన కార్లు ఉన్నాయి.. వాటి విలువ సుమారు గా రూ.12 కోట్లు విలువ చేస్తాయి. ఒక స్పెషల్ కార్ వ్యాన్ కూడా ఉన్నది.. దీని విలువ 20 కోట్లు పైనే ఉంటుంది. తాజాగా GMB బ్యానర్పై పలు చిత్రాలను నిర్మిస్తున్నారు. ఇక AMB ఆనే థియేటర్ కూడా ఉన్నది. దీని విలువ 80 కోట్లు. ఇక నమ్రత, మహేష్ మొత్తం ఆస్తి విలువ, బంగారం, వెండి, ప్లాటినమ్, పొలాలు ఆన్ని కలుపుకుంటే.. రూ.10,000 కోట్లు ఉన్నట్లు సమాచారం. నమ్రత కట్నం కింద దాదాపుగా రూ.2,500 కోట్ల రూపాయల ఆస్తిని తీసుకువచ్చింది .