నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఒకేసారి గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల

-

ఏపీలో ఉద్యోగ జాతర ప్రారంభం అయింది. గ్రూపు 2 నోటిఫికేషన్ విడుదలైన ఒక్క రోజు వ్యవధిలోనే గ్రూప్ 1  నోటిఫికేషన్ విడుదలవ్వడం ఏపీ చరిత్రలోనే రికార్డు అని చెప్పాలి.  ఈ నోటిఫికేషన్ ద్వారా 81 పోస్టులను భర్తీచేయనుంది జగనన్న ప్రభుత్వం. 9 డిప్యూటీ కలెక్టర్లు, 26 డీఎస్పీ పోస్టులో భర్తీ కానున్నాయి. ఇవాళ విడుదల చేసిన నోటిఫికేషన్ ను కింద వివరంగా అందజేశాం.

897 పోస్టులతో గ్రూప్ -2 నోటిఫికేషన్ విడుదలైంది.  ఇందులో ఎగ్జిక్యూటివ్ పోస్టులు – 331 కాగా.. నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు – 566 విడుదల చేసింది ప్రభుత్వం. గ్రూపు2, గ్రూపు 1 మాత్రమే కాకుండా  జగన్ ప్రభుత్వంలో హాయంలో 6 లక్షల 16 వేల 323 పోస్టులను నియమించింది. ఇన్ని ఉద్యోగాలు గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు. ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పిన బాబు సర్కార్  నమ్మక ద్రొహం చేసింది. సుప్రీం కోర్టు తీర్పు సాకుతో కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయకుండా మోసం చేసింది. జగన్ హయాంలో నిబంధనలు సడలించి సాధ్యమైనంత ఎక్కువ మందిని రెగ్యులరైజ్ చేసింది ప్రభుత్వం.

Notification_ Group-II_2023 with Syllabus

దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా 53 వేల 126 పోస్టుల్నీ భర్తీ చేసిన ఘనత జగనన్నకే దక్కుతుంది. వీరిలో 3899 మంది స్సెషలిస్ట్ డాక్టర్లు, 2088 మెడికల్ ఆఫీసర్లు, 13540 ఎఎన్ఎమ్ లు గ్రేడ్ 3 పోస్టులతో కలిపి 19527 పోస్టులు శాశ్వత ప్రాతిపదికన నియమాకాలు జరిగాయి. 2. వీటితో పాటు 10032 మంది ఎంఎల్ హెచ్పీలు, 6734 స్టాఫ్ నర్స్ లు, 9751 మంది పారా మెడికల్ సిబ్బంది, 3303 క్లాస్-4 సిబ్బంది, 249 మంది డీఈవోలతో పాటు మెడికల్ కాలేజీల్లో నియమించిన 1582 ఉద్యోగులు, ఇతర సిబ్బందితో కలిపి మొత్తం 53,126 పోస్టులున్నాయి.

ఏపీపీఎస్సీ గ్రూప్ – 1లో భ‌ర్తీ చేసే ఉద్యోగాలివే :

Notfn_ Group-I_2023 with Syllabus

డిప్యూటీ క‌లెక్టర్ పోస్టులు: 9
స్టేట్ టాక్స్ డిపార్ట్ మెంట్ లో అసిస్టెంట్ క‌మిష‌న‌ర్ పోస్టులు: 18
డీఎస్పీ పోస్టులు: 26
జైళ్ల శాఖ‌లో డిప్యూటీ సూప‌రింటెండెంట్ పోస్టులు: 1
డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీస‌ర్ పోస్టులు:1
ప్రాంతీయ ర‌వాణా ఆఫీసర్ పోస్టులు: 6
జిల్లా బీసీ వెల్పేర్ ఆఫీస‌ర్ పోస్టులు:1
జిల్లా సోష‌ల్ వెల్ఫేర్ ఆఫీస‌ర్ పోస్టులు: 3
ఏపీ కోఆప‌రేటివ్ డిప్యూటీ రిజిస్ట్రార్ పోస్టులు: 10
గ్రేడ్-2 మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ పోస్టులు: 11
అసిస్టెంట్ ఎక్సైజ్ సూప‌రింటెండెంట్ పోస్టులు: 1
అసిస్టెంట్ ట్రెజ‌రీ ఆఫీస‌ర్ పోస్టులు: 3
జిల్లా ఉపాధి క‌ల్ప‌నా అధికారుల పోస్టులు: 4
అసిస్టెంట్ ఆడిట్ ఆఫీస‌ర్ పోస్టులు: 2

Read more RELATED
Recommended to you

Latest news