డిసెంబర్ 28 నుంచి రైతుబంధు నిధులు విడుదల : హరీశ్ రావు

-

డిసెంబర్ 28 నుంచి 7500 కోట్లు యాసంగి పంట కోసం రైతు బంధు సహాయం అందజేస్తామని మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రకటించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం 7 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో మంత్రి తన్నీరు హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన్నీరు హరీష్ రావు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రైతుల గురించి ఆలోచన చేయాలని.. దేశానికి అన్నం పెడుతూ .. కోట్లాది మందికి ఉపాధి కల్పిస్తున్న రంగం వ్యవసాయ రంగం అని గుర్తు చేశారు.

వ్యవసాయ రంగం వ్యాపార రంగం గా చూడకూడదని.. వ్యవసాయం ను దండగ అనే స్థితి నుంచి కేసిఆర్ నేడు పండుగ గా మార్చారని కొనియాడారు. పదేళ్ల క్రితం గంజీ కేంద్రాలను పెట్టిన ప్రాంతంలో…. రైతు కు భీమా , ధీమా ను ఇచ్చి దేశానికే అన్నపూర్ణగా కేసిఆర్ మార్చారని చెప్పారు. తెలంగాణను కోటి ఎకరాల మాగాణి గా కేసిఆర్ తీర్చి దిద్దారని.. ఆసియా ఖండంలో పెద్దదైన కాళేశ్వరం ప్రాజెక్ట్ 3 ఏండ్ల లో మిషన్ మోడ్ లో పూర్తి చేశారని పేర్కొన్నారు. రైతు బంధు మీద ఇప్పటి వరకూ రాష్ట్ర ప్రభుత్వం 50 వేల కోట్ల రూపాయలను రైతులకు పంట పెట్టు బడి ఆర్థిక సహాయం అందించిందని తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Latest news