4జి స్మార్ట్ ఫోన్ రంగంలో జియో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. జియో లైఫ్ ఫోన్ల పేరిట జియో 4జి ఫోన్లను విడుదల చేసి వినియోగదారులకు మరింత చేరువ అయ్యింది. అలాగే చాలా తక్కువ ధరకే 4జి ఫీచర్ ఫోన్‌ను లాంచ్ చేసి గ్రామీణులకు దగ్గరైంది. అయితే ఇకపై ల్యాప్‌టాప్ రంగంలోనూ జియో సంచలనం సృష్టిస్తుందా ? అంటే.. అందుకు అవుననే సమాధానం వినిపిస్తోంది.
టెలికాం సంస్థ రిలయన్స్ జియో అతి త్వరలోనే జియో బుక్ పేరిట ఓ ల్యాప్‌టాప్‌ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. బ్లూబ్యాంక్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అనే సంస్థతో భాగస్వామ్యం అయిన జియో చవక ధరకు జియో బుక్ పేరిట ఓ ల్యాప్‌టాప్‌ను విడుదల చేయనుందని తెలిసింది. అందులో స్నాప్‌డ్రాగన్ 665 ప్రాసెసర్, 4జీ కనెక్టివిటీ వంటి ఫీచర్లను అందివ్వనున్నారని సమాచారం.
అయితే జియోబుక్‌లో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందిస్తారని తెలుస్తోంది. ఇక ఆ ల్యాప్‌టాప్ ధర ఎంత ఉంటుంది ? అనే వివరాలు తెలియలేదు. కానీ మార్కెట్‌లో అందుబాటులో ఉన్న బేసిక్ ల్యాప్‌టాప్‌ల కన్నా తక్కువ ధరకే ఆ ల్యాప్‌టాప్‌ను జియో అందిస్తుందని తెలిసింది. ఇక అతి త్వరలోనే ఆ ల్యాప్‌టాప్‌ను జియో విడుదల చేస్తుందని తెలుస్తోంది. కరోనా సమయంలో చాలా మందికి వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం, చదువు కోసం ఫోన్లు, ట్యాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌ల వంటి డివైస్ లు అవసరం అయ్యాయి. ఈ క్రమంలోనే అలాంటి వారి కోసం జియో ఆ ల్యాప్ టాప్‌ను విడుదల చేస్తుందని తెలిసింది.