దగ్గుబాటి కుటుంబం గత కొంతకాలంగా రాజకీయాల్లో పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. దగ్గుబాటి పురంధరేశ్వరి దగ్గుబాటి వెంకటేశ్వరరావు పెద్దగా మీడియాతో మాట్లాడే ప్రయత్నాలు కూడా చేయడం లేదు. రాజకీయంగా దగ్గుబాటి కుటుంబం ఇప్పుడు ఎప్పుడూ లేని విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంది అనే చెప్పాలి. పార్టీలో ఉన్నా సరే వైసీపీ నేతలు దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదని దీంతో ఆయన తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారు అనే వార్తలు కూడా వినిపించాయి.
ఇక ఇప్పుడు మరికొన్ని వార్తలు కూడా ఆ కుటుంబం గురించి వస్తున్నాయి. కుటుంబం మొత్తం కూడా తెలుగుదేశం పార్టీలోకి రావడానికి ఆసక్తిగా ఉందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. నందమూరి బాలకృష్ణ తో చర్చలు జరుపుతున్నారని కొంతమంది వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పుడు దగ్గుబాటి కుటుంబం విషయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ జాగ్రత్త పడుతున్నారట. వచ్చే ఎన్నికల్లో ఒంగోలు ఎంపీ సీటు ఖరారు చేస్తామని ముఖ్యమంత్రి జగన్ నుంచి దగ్గుబాటి వెంకటేశ్వర రావు కి సమాచారం వెళ్లినట్లుగా తెలుస్తోంది.
పార్టీ కోసం పని చేయాలి అనుకుంటే ఇప్పుడు ప్రజల్లోకి రావాల్సిన అవసరం ఉందని ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తానని ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆయనకు హామీ ఇచ్చారు. అయితే దగ్గుబాటి పురంధరేశ్వరి కూడా వైసీపీలోకి రావాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో దగ్గుబాటి వెంకటేశ్వరరావు చర్చలు జరుపుతారని తెలుస్తోంది.