పన్ను చెల్లింపుదారులకు రిలీఫ్: కేంద్ర ప్రభుత్వం

-

మహమ్మారి కారణంగా ఎన్నో సమస్యలతో సతమతమవుతూ వచ్చాము. మొదటి వేవ్ ముగిసిపోయిన తర్వాత రెండో వేవ్ ని కూడా మనం చూసాము. ఈ రెండవ వేవ్ లో చాలా మంది అనేక సమస్యలకు గురయ్యారు.కేంద్ర ప్రభుత్వం Central Government పన్ను చెల్లింపుదారులకు ఊరట కలిగించే నిర్ణయాలు తాజాగా తీసుకుంది.

కేంద్ర ప్రభుత్వం /Central Government
కేంద్ర ప్రభుత్వం /Central Government

ఇటువంటి సమస్యల నుండి ప్రజలు బయట పడాలని కేంద్ర ప్రభుత్వం పన్ను చెల్లింపుదారులకు ఊరట కలిగించే నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మరి ఆలస్యం ఎందుకు వాటి కోసం ఇప్పుడే పూర్తిగా చూసేద్దాం.

కేంద్ర ప్రభుత్వం పన్ను చెల్లింపుదారులకు ఊరట కలిగించే నిర్ణయాలు తాజాగా తీసుకుంది. పలు అంశాలకు సంబంధించిన డెడ్లైన్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అదే విధంగా ఇతర కొత్త నిర్ణయాలు కూడా కేంద్రం తీసుకోవడం జరిగింది. దీనితో పన్ను చెల్లింపుదారులు కి కాస్త రిలీఫ్ గా ఉంటుందని చెప్పాలి.

ఇక వాటి కోసం చూసేస్తే.. కోవిడ్ 19 ట్రీట్‌మెంట్ కోసం ఉద్యోగులు కంపెనీ నుంచి పొందే డబ్బుల పై ఎలాంటి పన్ను ఉండదు అని అంది. అంతే కాకుండా కరోనా చికిత్స కోసం బంధువులు, ఇతరుల నుంచి తీసుకునే డబ్బులకు కూడా ఇదే వర్తిస్తుంది అని కేంద్రం అంది.

ఇది ఇలా ఉంటే కేంద్రం క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ గడువు పొడిగించింది. సెప్టెంబర్ 30 వరకు గడువు ఇచ్చింది. అలానే కేంద్ర ప్రభుత్వం వివాద్ సే విశ్వాస్ స్కీమ్ కింద వడ్డీ లేకుండా డబ్బులు చెల్లించడానికి ఆగస్ట్ 31 వరకు గడువు ఇచ్చింది.

కోవిడ్ 19 వల్ల చనిపోయిన వారి కుటుంబాలకు కంపెనీల నుంచి లభించే ఎక్స్‌గ్రేషియా డబ్బులపై కూడా ఎలాంటి పన్ను పడదు గమనించండి. రూ.10 లక్షల పరిమితి వరకు పన్ను కట్టాల్సిన అవసరం లేదు అని కేంద్రం స్పష్టం చేసింది. ఆధార్ పాన్ లింక్ గడువును కూడా పొడిగించింది. సెప్టెంబర్ 30 వరకు గడువు ఉంది. పాన్ ఆధార్ లింక్ చేసుకోకపోతే పాన్ కార్డు చెల్లదు.

Read more RELATED
Recommended to you

Latest news