రెమిడెసివర్ కావాలా.. ఈ నెంబర్ కు వాట్సాప్ చేయండి !

-

దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో రెమిడిసివిర్ మందును ఓ సంజీవని లా  భావిస్తున్నారు.. నిజానికి దీనికి అంత శక్తి ఉందో లేదో తెలియదు కానీ ఈ ముందు దొరికితే కరోనా సోకిన వాళ్ళు బతికి పోతారు అని అపోహ మాత్రం జనాల్లో ఉంది. దీంతో ఈ మందు ఎక్కడ దొరుకుతున్నా అది బ్లాక్ లో కూడా డబ్బులు పెట్టి కొనడానికి సిద్ధమవుతున్నారు. ఈ మందు అమ్మేందుకు గాను హెట్రో కంపెనీ కూకట్పల్లి వై జంక్షన్ లో ఒక స్టోర్ ఓపెన్ చేసింది..

అయితే అక్కడకు వేల సంఖ్యలో జనం వస్తున్న నేపథ్యంలో ఇక నుంచి నేరుగా అమ్మకాలు జరపలేమని సదరు కంపెనీ పేర్కొంది. ఇకమీదట 9133896969 నెంబర్ కు వాట్సాప్ మెసేజ్ పంపిస్తే చాలు అని పేర్కొంది. రోగి పేరు, ఐపీ నెంబరు, అటెండర్ పేరు, మొబైల్ నెంబర్, హాస్పిటల్ పేరు, సిటీ పేరు ఇంజక్షన్ల సంఖ్య వివరాలను మెసేజ్ ద్వారా పంపిస్తే ఆ తర్వాత మందుకోసం తమ కంపెనీకి ఏ సమయం రావాలో తిరిగి ఫోన్ కి మెసేజ్ పంపిస్తారు. భారీ ఎత్తున జనాలు గుమిగూడారు ఉన్న నేపథ్యంలో ఈ ఏర్పాటు చేసినట్లు కంపెనీ పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news