రెమిడిసివిర్ ప్రాణాలను కాపాడదు !

-

 కరోనాతో ఆస్పత్రిలో చేరి ఆక్సిజన్ సపోర్ట్ మీద ఉన్న వారికి మాత్రమే రెమిడిసివిర్ పని చేస్తుందని, దాన్ని సాధారణ యాంటీ బయోటిక్ డ్రగ్ లా వాడవద్దని ప్రఖ్యాత ఎయిమ్స్ చీఫ్ రణదీప్ గులేరియా మరోసారి స్పష్టం చేశారు. రెమిడిసివిర్ అనే డ్రగ్ ఇంకా పరిశీలనలో ఉందన్న ఆయన ఎమర్జెన్సీ కోసం అనుమతి ఇచ్చారని పేర్కొన్నారు. దీని వలన ప్రాణాలు నిలబడినట్లు ఎక్కడా నిరూపణ కాలేదన్న ఆయన ఎట్టి పరిస్థితుల్లో సాధారణ ఐసోలేషన్ లో ఉన్న వారికి ఈ డ్రగ్ ఇవ్వద్దని అన్నారు. 

నిజానికి అసలు ఈ డ్రగ్ ఏమిటో కూడా తెలియని వారు కరోనా సోకితే ఇది వాడాలి ఏమి అనుకుని కొని వాడే పరిస్థితి. దీనిని క్యాష్ చేసుకుంటున్న కేటుగాళ్ళు ‘కరోనా వైరస్ బారిన పడ్డారా.? అయితే, ఆక్సిజన్ కోసం ఈ నెంబర్ ప్రయత్నించి చూడండి.. రెమిడిసివిర్ ఇంజక్షన్ కోసం వీరిని సంప్రదించండి.. వైద్య సహాయం కోసం ఈ నెంబర్ సంప్రదించండి..’ అంటూ సోషల్ మీడియా వేదికగా రకరకాల పోస్టింగ్స్ పెట్టి పని కానిస్తున్నారు. దీంతో కరోనా సోకి క్రిటికల్ గా ఉన్నప్పుడు చికిత్స కోసం వాడుతున్న రెమిడిసివిర్ ఇంజెక్షన్ ఇప్పుడు సరిగ్గా దొరకడం లేదు. అంతా బ్లాక్ మార్కెట్ కి తరలిపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news