బ్రిటీషర్లపైకి దూసుకెళ్లిన బుల్లెట్.. జోహార్.. సుభాష్ చంద్రబోస్

-

సుభాష్ చంద్రబోస్ 1897లో ఒడిశాలోని కటక్ లో జన్మించారు. ఆయన తండ్రి జానకీనాథ్ బోస్. ఆయన లాయరు. తల్లి ప్రభావతి. బోస్.. 1920లో భారత సివిల్ సర్వీసుకు ఎంపికైనప్పటికీ… దాని నుంచి వైదొలిగి.. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో పాలు పంచుకున్నారు.

నేతాజీ సుభాష్ చంద్రబోస్. బ్రిటీషర్లపైకి దూసుకెళ్లిన బుల్లెట్ ఆయన. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా నేతాజీ జరిపిన పోరాటం వాళ్లకు ముచ్చెమటలు పట్టించింది. తన 23 ఏళ్ల వయసు అప్పుడే సుభాష్ చంద్రబోస్… భారత జాతీయ కాంగ్రెస్ సభ్యుడిగా చేరారు.

సుభాష్ చంద్రబోస్ 1897లో ఒడిశాలోని కటక్ లో జన్మించారు. ఆయన తండ్రి జానకీనాథ్ బోస్. ఆయన లాయరు. తల్లి ప్రభావతి. బోస్.. 1920లో భారత సివిల్ సర్వీసుకు ఎంపికైనప్పటికీ… దాని నుంచి వైదొలిగి.. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో పాలు పంచుకున్నారు.

ఓవైపు గాంధీజీ అహింసా మార్గం ద్వారా స్వతంత్రం సాధించాలని తపిస్తుంటే.. చంద్రబోస్ మాత్రం… సాయుధ పోరాటం ద్వారానే బ్రిటీషర్లను దేశం నుంచి తరిమి కొట్టొచ్చని నమ్మారు. దాన్నే ఆచరించారు.

రెండు సార్లు ఆయన భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ అనే పార్టీని స్థాపించారు. ఆయన్ను ఆంగ్లేయులు 11 సార్లు జైలులో వేశారు.

1939లో రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో బ్రిటీషర్లను భారత్ నుంచి తరిమేయడానికి ఇదే సరైన సమయం అనుకొని… వాళ్లపై పోరాడటానికి ఓ కూటమిని ఏర్పాటు చేయడం కోసం.. రష్యా, జర్మనీ, జపాన్ దేశాలకు వెళ్లారు జపాన్ సాయంతో భారత జాతీయ సైన్యాన్ని ఏర్పాటు చేశారు.

భారత స్వాతంత్ర్య పోరాటంలో బోస్ పాత్ర మరువలేనిది. కాకపోతే.. అప్పట్లో ఆయన విదేశీ పర్యటనలపై ఎన్నో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయినప్పటికీ.. ఆయన స్వాతంత్ర్యం కోసం తన జీవితాన్ని దారపోశారన్నది కాదనలేని వాస్తవం. ఆయన జీవితంలాగానే ఆయన మరణం కూడా వివాదాస్పదమైంది. 1945 ఆగస్టు 18న తైవాన్ లో జరిగిన విమాన ప్రమాదంలో ఆయన మరణించినట్టు ప్రకటించారు. కానీ.. ఆయన ఆ ప్రమాదంలో మరణించలేదని కొందరు చరిత్రకారులు చెబుతుంటారు.

Read more RELATED
Recommended to you

Latest news