రాజస్థాన్ అసెంబ్లీలో ఇవాళ శాసనసభ వ్యవహారాల మంత్రి శాంతి కుమార్ ధారివాల్ విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ విశ్వాస పరీక్షలో అశోక్ గెహ్లాట్ సర్కార్ విజయం సాధించింది. మూజువాణి ఓటుతో నెగ్గినట్లు స్పీకర్ ప్రకటించారు. బీజేపీ అవిశ్వాసం పెట్టాలనుకున్న సమయంలో అనూహ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. అనంతరం శాసనసభను ఆగస్టు 21కు వాయిదా వేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు.
అవిశ్వాస తీర్మానాన్ని ప్రభుత్వమే ప్రవేశపెట్టి, భారీ మెజార్టీతో విజయం సాధించడం నిజంగా చాలా సంతోషంగా ఉందని, అలాగే రాజస్థాన్ రైతుల సమస్యలను పరిష్కరిస్తామని ఈ సందర్భంగా సచిన్ పైలట్ వ్యాఖ్యానించారు. అలాగే సీఎం అశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ.. ప్రభుత్వాన్ని కూల్చాలన్న ప్రతిపక్ష ప్రయత్నాలు ఎప్పటికీ నెరవేరబోవని అన్నారు. ముమ్మాటికి రాజస్థాన్‌లో ఐదేళ్లూ పాలిస్తామని, ప్రభుత్వాన్ని ఎప్పటికీ కూలిపోనివ్వనని వ్యాఖ్యానించారు.