నేడే నయనతార వివాహం..పెళ్లి రోజే విఘ్నేష్ సంచలన పోస్ట్ !

-

స్టార్‌ హీరోయిన్‌, లేడీ సూపర్ స్టార్ నయనతార పెళ్లి పీటలు ఎక్కుతున్న విషయం తెలిసిందే. దర్శకుడు విగ్నేష్ శివన్ తో నయనతార ఏడడుగులు నడవనున్నారు. నేడే మహాబలిపురంలో నయన్, విగ్నేష్ ల వివాహం జరగనుంది. ఇక ఇవాళే వివాహం కానున్న నేపథ్యంలో.. పెళ్లి పనులు చక చక జరుగుతున్నాయి. ఇక ఇవాళ పెళ్లి ఉన్న నేపథ్యంలో నయనతార కాబోయే భర్త.. దర్శకుడు విగ్నేష్ శివన్ సంచలన పోస్ట్‌ చేశాడు.

“ఈ రోజు జూన్‌ 9వ తేదీ. ఇది నయన్‌ దే. నా జీవితాన్ని ఇంత అందంగా తీర్చిదిద్దిన భగవంతుడికి, ఈ విశ్వానికి, నా జీవితంలో మంచి మనుషులు అందరికీ.. ప్రతి ఒక్క మంచి మనసుకు, ప్రతి ఒక్కరి ఆశీర్వాదానికి, షూటింగ్ లో ప్రతి రోజుకు థ్యాంక్యూ. మీ ప్రార్థనలకు రుణపడి ఉంటాను. ఇప్పుడు ఇదంతా లవ్‌ ఆఫ్‌ మై లైఫ్‌. నయన తారకు అంకితం ఇస్తున్నాను. ” అని విఘ్నేష్‌ శివన్‌ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news