మన దేశంలో అధిక శాతం ఉండేది పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన ప్రజలే. వారికి విలాసవంతమైన స్మార్ట్‌ఫోన్లను వాడే అవకాశం ఉండదు. దీంతో వారు తమ స్థోమతకు అందుబాటులో ఉండే ఫోన్లను కొనుగోలు చేసి వాడుతుంటారు. అలాంటి వారు విలాసవంతమైన ఫోన్లను కొని వాడాలంటే అది వారి తాహతుకు మించిన పనే. అయితే ఇకపై ఆ ఇబ్బంది అవసరం లేదు. ఎందుకంటే.. విలాసవంతమైన ఫోన్లను కొనుగోలు చేయాల్సిన పని లేకుండా వాటిని అద్దెకు తీసుకుని ఇష్టం వచ్చినన్ని రోజులు వాడుకుని తిరిగి ఫోన్‌ను రిటర్న్ చేయవచ్చు. కేవలం అద్దె మాత్రమే చెల్లిస్తే చాలు. ఈ సేవను అందిస్తోంది.. రెంట్ మోజో..!
విలాసవంతమైన స్మార్ట్‌ఫోన్లను వాడాలని కోరిక ఉండే వారి కోసం రెంట్ మోజో ఖరీదైన స్మార్ట్ ఫోన్లను అద్దుకు ఇస్తోంది. యాపిల్ ఐఫోన్లు, గూగుల్ పిక్సల్ ఫోన్లు, శాంసంగ్ గెలాక్సీ ఫోన్లు.. ఇలా రక రకాలైన ఖరీదైన ఫోన్లు రెంట్ మోజో సైట్‌లో వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. వారు తమకు కావల్సిన ఫోన్‌ను ఎంచుకుని నిర్దిష్ట మొత్తంలో సొమ్మును డిపాజిట్ చేస్తే చాలు, ఫోన్‌ను అద్దెకు ఇస్తారు. అందుకు గాను వారు నెల నెలా ఆ ఫోన్‌కు అద్దె చెల్లించాలి.
ఇక ఫోన్‌ను వద్దనుకుంటే రిటర్న్ చేయవచ్చు. అలా చేస్తే డిపాజిట్ చేసిన సొమ్మును తిరిగిస్తారు. లేదా.. ఫోన్‌ను దగ్గరే పెట్టుకుంటాం.. కావాలనుకుంటే.. అందుకు చాలా స్వల్ప మొత్తంలో సొమ్ము చెల్లిస్తే చాలు.. అన్ని రోజులు వాడిన ఆ ఫోన్ మీ సొంతమవుతుంది. అయితే ప్రస్తుతం రెంట్ మోజో సేవలు దేశంలో మెట్రో నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. తరువాత ఇతర ప్రాంతాల్లోనూ ఈ సేవలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కనుక మీకు కూడా ఖరీదైన స్మార్ట్‌ఫోన్ కావాలనుకుంటే దాన్ని కొనుగోలు చేయకండి. దాన్ని అద్దెకు తీసుకోండి..!