హలో మహేష్‌గారా అండీ..? నేను బ్యాంక్ బజార్ నుండి మాట్లాడుతున్నాను.. మీకు లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డు ఆఫర్ చేస్తున్నాం.. ఇప్పటికే చాలా వాడుతున్నా.. అవసరంలేదు. అయితే మీకు లోన్ కూడా ఎలిజిబిలిటీ ఉండి తీసుకుంటారా..? ఇదీ పొద్దు ప్రొద్దున మహేష్‌కి వచ్చిన కాల్. మహేష్‌కి మాత్రమే కాదు సురేష్‌కి, రమేష్‌కి కూడా ఇదే రకంగా ఫోన్లు. ఏంటిదీ ఈ బ్యాంక్ వాళ్లు ఎందుకు ఇంతలా అడుతున్నారు..
ఈ రోజుల్లో వ్యాపార అవసరాలు, వ్యక్తిగత అవసరాలు, గృహ నిర్మాణాలు… ఎక్కువ కావడంతో ఎక్కువ మంది రుణాల మీద ఆధారపడుతున్నారు. దేశం మొత్తం ఇదే ఎక్కువగా నడుస్తుంది. అందుకే బ్యాంకింగ్ రంగంలో గాని, లోన్లు ఇచ్చే సంస్థల్లో గాని… అనేక ఆఫర్లు ప్రకటిస్తూ జనాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇక వడ్డీ రేట్లను తగ్గిస్తూ ప్రజలకు ఆమోదయోగ్యంగా అందించే ప్రయత్నం చేస్తున్నాయి. ఇదే క్రమంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకు ల మధ్య పోటీ కూడా తీవ్రంగా నెలకొంది అనేది గత ఆరు ఏళ్ళు గా చూస్తున్న పరిణామాల,
ఆధారంగా స్పష్టంగా చెప్పవచ్చు అనేది నిపుణుల మాట. ఈ క్రమంలోనే అసలు బ్యాంకు రుణంలో రావాల౦టే ఏం చెయ్యాలి… ఏ బ్యాంకు రుణాలు త్వరగా ఇస్తుంది అనే దాని మీద జనం ఎక్కువగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ కొందరి మాట ప్రకారం చూస్తే… ప్రైవేట్ బ్యాంకులు రుణాలు త్వరగా ఇస్తాయి అని అంటూ ఉంటారు… దానికి కారణాలు చాలానే చెప్తున్నారు. ప్రైవేట్ బ్యాంకులకు వాటి యాజమాన్యాలు టార్గెట్ లు పెడుతూ ఉంటాయి… అందుకే తాము లోన్ ఇస్తామని వెంటపడుతూ ఉంటారు.
ఇకపోతే ప్రైవేట్ బ్యాంకింగ్ మీద నమ్మకం కలిగించే ప్రక్రియలో భాగంగా కూడా రుణాలను వేగంగా ఇస్తూ ఉంటాయి. అందుకే యాక్సిస్ బ్యాంకు, icici వంటి బ్యాంకు లు రుణాలు ఇస్తామని ఖాతాదారుల చుట్టూ తిరుగుతూ ఉంటాయి, ఇక ప్రభుత్వ రంగ బ్యాంకు లతో పోలిస్తే, విద్యా రుణాలు, గృహ రుణాల మీద వడ్డీ కూడా ప్రైవేట్ బ్యాంకు ల్లో తక్కువగా ఉంటుందట. బంగార౦ రుణాల విషయంలో కూడా ప్రైవేట్ బ్యాంకులు వినియోగదారులను సంతృప్తి పరుస్తాయని. ఫిక్సిడ్ డిపాజిట్ మీద లోన్ కూడా త్వరగా వస్తుందని సూచిస్తున్నారు.