ఎగ్జిట్ పోల్స్ కు మించి ఫలితాలు: సజ్జల రామకృష్ణారెడ్డి

-

ఆంధ్ర ప్రదేశ్ లో అధికారం ఎవరిదో ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి. దేశవ్యాప్తంగా ఎన్నికలు ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రిలీజ్ అయ్యాయి.ఈ పోల్స్‌లో ఆంధ్ర ప్రదేశ్ కి సంబంధించి వైసీపీ, తెలుగుదేశం పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనేది సర్వేల ఆధారంగా ఈ పోల్స్‌ను విడుదల చేశాయి. 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాల్లో ఏ పార్టీకి ఎన్ని అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లు వస్తాయనేది తేల్చాశాయి. పలు సర్వేలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఫలితాలను ప్రకటించగా మరికొన్ని సర్వేలు వైసిపికి అనుకూలంగా ఫలితాలను ప్రకటించాయి.

ఈ క్రమంలో ఎగ్జిట్ పోల్స్ ప్రకారం తమకే అధికారం వస్తుందని వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ‘జూన్ 4న దీనికి మించి ఫలితాలు వస్తాయి. మహిళలు వైసీపీకి అండగా నిలిచారు. చాలా సైలెంట్గా వైసీపీకి ప్రజలు ఓట్లు వేశారు. అన్ని పార్టీలు ఏకమైనా వాళ్లు గెలవడం లేదు. ఎందుకు అధికారంలోకి రాలేకపోతున్నారో వాళ్లు ఆలోచించుకోవాలి’ అని హితవు పలికారు. కాగా, ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేయగా, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కూటమిగా బరిలోకి దిగాయి.

Read more RELATED
Recommended to you

Latest news