తెలంగాణాలో ఎన్నికలు జరగడానికి మరో రెండు వారాలు సమయం మాత్రమే మిగిలి ఉంది. అందుకే అన్ని పార్టీల నేతలు ప్రచారాలను వేగవంతం చేస్తున్నారు. ఇక సర్వేలు అన్నీ కాంగ్రెస్ లేదా BRS వైపే మొగ్గు చూపుతున్నాయి. ఇక తాజాగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ, త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ BRS తో పోటాపోటీగా తలపడుతున్నామంటూ చెప్పారు. ఇందుకు అదేంటి బీజేపీ తో మీకు పోటీ లేదా అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా, బీజేపీ ఎన్నికల్లో ఉందంటే ఉంది.. ఆ పార్టీ నామమాత్రమే, కాంగ్రెస్ కు బీజేపీతో అస్సలు పోటీ ఉంటుందని అనుకోవడం లేదు అంటూ రేవంత్ రెడ్డి సమాధానం ఇచ్చారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ప్రేక్షక పాత్ర పోషిస్తుంది, ఇంకా అవసరం అయితే కేసీఆర్ కు సాయం చేస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు అంటూ రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు.
మరి రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా BRS తోనే అసలైన పోటీనా, లేదా అన్నది తెలియాలంటే ఎన్నికలు వచ్చే వరకు ఆగాల్సిందే.