ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ జాతీయ కార్యదర్శిగా ఉన్న నారా లోకేష్ జగన్ ప్రభుత్వంపై నిత్యం ఏదో ఒక సమస్యను లేవనెత్తుతూ ఇరకాటంలో పెట్టేందుకు ప్రయత్నిస్తూ ఉంటాడన్నది మీడియా సంస్థలు చెబుతున్నాయి. ఇక తాజాగా నారా లోకేష్ ఒక లేఖను సీఎం జగన్ కు రాయడం జరిగింది.. ఈ లేఖలో నారా లోకేష్ డిగ్రీ మరియు పీజీ విద్యార్థులకు సంబంధించిన ఫీజుల బకాయిలు ఉన్నాయని వాటిని వెంటనే చెల్లించాలన్నది సారాంశం. అంతే కాకుండా జగన్ కు లేఖ రాసినట్లుగా లోకేష్ ట్విట్టర్ వేదికగా తెలియచేశాడు. కాలేజీలకు చెల్లించాల్సిన మొత్తం బకాయిలు రూ. 1650 కోట్లుగా ఉన్నాయని వెంటనే ఈ మొత్తాన్ని చెల్లించాలంటూ లేఖ ద్వారా జగన్ ను డిమాండ్ చేశారు నారా లోకేష్.
ఫీజులు కట్టకపోతే సదరు కాలేజీలు ఏవీ విద్యార్థులను పరీక్షలు రాయనివ్వడం లేదని చెబుతూ జగన్ ను విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దంటూ నారా లోకేష్ సీరియస్ గా ప్రశ్నించారు. మరి ఈ ట్వీట్ కు వైసీపీ నుండి ఎవరైనా స్పందిస్తారా అన్నది తెలియాల్సి ఉంది.