వన్డే ప్రపంచకప్ 2023 తుది అంకానికి చేరుకుంది. వరుస విజయాలు సాధిస్తూ టీమ్ఇండియా ఫైనల్‌కు దూసుకువెళ్లింది. ఆదివారం (నవంబర్ 19)న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా పేరుగాంచింది. 1,32,000 ఈ స్టేడియం కెపాసిటీ. కాగా.. ఈ మ్యాచ్‌కు ముఖ్య అతిథిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఆయనతో పాటుగా పలువురు కేంద్రమంత్రులు, భారత మాజీ క్రికెటర్లు, వివిధ రంగాల సెలబ్రిటీలు మ్యాచును వీక్షించేందుకు రానున్నారు.
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కు మోదీ హాజరు అవుతుండటంతో.. క్రికెట్ అభిమానులే కాదు.. అన్ని రాజకీయ పార్టీల చూపు ఇప్పుడు అటువైపు మళ్లింది. అందులోనూ ఆదివారం కావటంతో మరింత హైప్ క్రియేట్ అవుతుంది. ప్రధాని మోదీతోపాటు బాలీవుడ్ సెలబ్రిటీలు, ప్రముఖ రాజకీయ నాయకులు సైతం ఈ మ్యాచ్ కు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. క్రికెట్ మ్యాచ్ కు మోదీ హాజరుకావటం ఇది రెండో సారి. బోర్డర్ గవాస్కర్ సిరీస్ లో భాగంగా ఇండియా, ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్ కు హాజరయ్యారు మోదీ. అది కూడా ఇదే స్టేడియంలో కావటం విశేషం. ఇప్పుడు వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ మొత్తాన్ని చూడనున్నారు మోదీ.