ఈటెల‌ కేసీఆర్ అందుకే విడిపోయారు..బాంబు పేల్చిన రేవంత్ రెడ్డి..!

కాంగ్రెస్ పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి హుజురాబాద్ ఉపఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్నారు. ఈ సంధ‌ర్బంగా రేవంత్ రెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. దేవుడి మాన్యాలను పంచుకునే విషయంలో తలెత్తిన వివాదాల కార‌ణంగానే ఈటెల రాజేంద‌ర్ కేసీఆర్ విడిపోయార‌ని రేవంత్ వ్యాఖ్యానించారు. అక్ర‌మ సంపాద‌న పంప‌కాల‌లో వ‌చ్చిన ఇష్యూల వ‌ల్ల‌నే ఇద్ద‌రూ విడిపోయార‌ని దాంతో హుజురాబాద్ ఉప ఎన్నిక‌లు వ‌చ్చాయ‌ని వ్యాఖ్యానించారు.

ఇద్ద‌రిదీ దేవుడి మాన్యాలు లాక్కున్న పంచాయితీ…ద‌ళితులు భూములు ఆక్ర‌మించుకున్న పంచాయితీ అంటూ రేవంత్ రెడ్డి బాంబులు పేల్చారు. వేషం మార్చి బీజేపీలో చేరినంత మాత్రాన ఈటెల ఉత్త‌ముడు అవుతాడా అంటూ రేవంత్ రెడ్డి ప్ర‌శ్నించారు. ఇద్ద‌రూ దేనికోసం కొట్లాడారు. పేద‌ల కోసం కొట్లాడారా..? రైతులకు గిట్టుబాటు ధ‌ర కోసం కొట్లాడారా..? చ‌దువుకున్న యువ‌త‌కు ఉద్యోగాల కోసం కొట్లాడారా.? అంటూ రేవంత్ ప్ర‌శ్నలు కురిపించారు. కేసీఆర్ పెద్ద కొడుకు అని చెబుతాడ‌ని..మ‌న కొడుకులకు ఉద్యోగాలు ఇస్తే ఈ ప‌రిస్థితి వ‌చ్చేదా అని రేవంత్ రెడ్డి ప్ర‌శ్నించారు.