తెలంగాణ పీసీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు ఎన్నో రోజులు లేవని.. ఈ ఏడాది డిసెంబర్ లో కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేస్తారని… మార్చిలో ఎన్నికలకు వస్తాయని ఆయన అన్నారు. కేసీఆర్ ఆత్మహత్య చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాడని… తొందర్లోనే కేసీఆర్ మెడకు తాడు కట్టుకుని ఫ్యాన్ కు వేలాడపడతాడని విమర్శించారు. కేసీఆర్ కు రోజులు దగ్గర పడ్డాయని ఆయన అన్నారు. రాష్ట్రంలో పేదల కష్టాలు తీర్చాల్సిన ఆయన దేశం అంతటా దేశ దిమ్మరిలా తిరుగుతున్నాడని.. చెట్టుమీద కోతిలాగా, కాలుకాలిన పిల్లిలా తిరుగుతున్నారని విమర్శించారు.
ఈ డిసెంబర్ లో అసెంబ్లీ రద్దు.. మార్చిలో ఎన్నికలు: రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
-