రాష్ట్రంలో ప్రతీ క్రైం వెనక టీఆర్ఎస్ నేతలు ఉంటున్నారు…. రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు

-

తెలంగాణలో లక్షలాది ఎకరాాల్లో మిర్చి పంట తెగుళ్ల బారిన పడితే… కనీసం శాస్త్రవేత్తలను కూడా ప్రభుత్వం పంపించలేదని… రైతులు వరి వేస్తే ఉరి వేసుకున్నట్లే అంటూ ప్రభుత్వం రైతులను భయపెట్టిందని విమర్శించారు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. వేలాది మిర్చి బస్తాలు వస్తే కొనేవాళ్లు లేరని… మిర్చికి ధర పెంచాలని కోరితే, రైతులు నిరసన తెలిపితే రైతులకు బేడీలు వేసిన నీచమైన చరిత్ర మీదని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. వేరే పంటకు సరైన ధర రాకే వరి వైపు రైతులు మొగ్గు చూపుతున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ మొత్తాన్ని తాగు బోతులుగా తయారు చేస్తున్నారని… ఊరూరా బెల్ట్ షాపుల తెరిచి రాష్ట్రాన్ని భ్రష్టుపట్టిస్తున్నారని విమర్శించారు. రూ. 10,500 కోట్ల ఎక్సైజ్ ఆదాయాన్ని రూ. 36,000 కోట్లకు పెంచారని దుయ్యబట్టారు. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ 6 పబ్బులకు అనుమతి ఇస్తే కేసీఆర్ పాలనలో 89 పబ్బులకు అనుమతులు ఇచ్చారని… ఎక్కడ కంటైనర్ ని ఆపినా గంజాయి బయటపడుతోందని విమర్శించారు. గంజాయి, డ్రగ్స్, క్లబ్బులు, పబ్బులు ఇలా తెలంగాణను విధ్వంసం చేశారని కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శించారు. తెలంగాణలో ప్రతీ క్రైం వెనక టీఆర్ఎస్ నేతలు ఉంటున్నారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల పబ్బుల్లో పట్టుబడ్డ వారిని విచారించకుండా కేటీఆర్ అడ్డుకున్నారని విమర్శించారు. పట్టుబడిన 148 మంది దగ్గర నుంచి రక్తనమూనాలు సేకరించకుండా కాలయాపన చేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version