భూమిపై 7 విచిత్ర రహస్యాలు.. సైంటిస్టులే పక్కన పెట్టేశారు

-

సమాధానం లేని ప్రశ్నలు చేధించడం అంటే.. కొందరికి తెగ ఇష్టం ఉంటుంది. ఎలా అయినా సరే.. ఆన్సర్ కనుక్కోవాలని తాపత్రయ పడుతుంటారు. మీది అదే మెంటాలిటీ అయితే.. ఈ కథనం మీ బుర్రకు ఇంకా పదును పెడుతుంది. సో కాల్డ్ సైంటిస్టులే మా వల్ల కాదు అని వీటిని ఛేదించలేక వదిలేశారు. అలాంటి ఏడు రహస్యాలను ఇప్పుడు మనం చర్చించుకుందాం.
అంటార్కిటికా సీక్రెట్స్
అంటార్కిటికా ఒకప్పుడు ఇండియా లాగా ఉండేది. అడవులు, చెట్లు, నదులు, సరస్సులతో ఉండేది. చాలా అందంగా ఉండేది. అప్పట్లో పక్షులు, జంతువులు, డైనోసార్లు కూడా అక్కడ ఉండేవట. అలాంటి ఖండం కాస్తా మంచు ఖండంలా మారిపోయింది. అక్కడి జేమ్స్ రాస్ దీవిలో శిలాజాలను సైంటిస్టులు వెలికి తీశారు. అవి 7.1 కోట్ల సంవత్సరాల కిందటివి అని తేలింది. ఆ సమయంలో అలా ఉన్న ఖండం.. ఇలా ఎందుకైందన్నది మిస్టరీ.

గోబెక్లీ టేపే (Gobekli Tepe):

పురాతత్వవేత్తలు టర్కీలో ఓ నిర్మాణాన్ని కనుక్కున్నారు. దాన్ని గోబెక్లీ టేపే అంటున్నారు. చూడటానికి అది ఓ ఆలయం లా కనిపిస్తుంది.. అవి ఇప్పటి ఆలయాల స్తంభాల లాగా కాకుండా పూర్తి వైవిధ్యంగా ఉన్నాయి. వాటిపై జంతువుల బొమ్మలు, విచిత్ర ఆకారాలు ఉన్నాయి. ఆ నిర్మాణం క్రీస్తుపూర్వం నాటిదిగా భావించారు. దాన్ని ఎవరు నిర్మించారో, అది అలయమేనా కాదా అన్నది ఇప్పటికీ మిస్టరీయే. ఈ రహస్యాన్ని ఛేదించడం కూడా శాస్త్రవేత్తలకు కష్టమేంది.

కలహారీ ఎడారికి ఏమైంది? (Kalahari Desert Civilization)

ఇండియాకి సింధు నాగరికత ఎలాగో… ఆఫికాకి కలహారీ కూడా ఒకప్పుడు ప్రత్యేక నాగరికత ఉండేదట. అలాంటి నాగరికత ఎలా అంతమైందో తెలియదు. 19వ శతాబ్దంలో విలియం లియోనార్డ్ హంట్ బృందం.. ఆ ఎడారిలో తవ్వకాలు జరిపింది. అక్కడ కొన్ని ఫొటోలు తీసింది. అక్కడ తమకు పురాతన నాగరికతకు చెందిన ప్రాచీన ఆనవాళ్లు కనిపించాయని ఆ టీమ్ చెప్పుకొచ్చింది.. ఈ వార్త అన్వేషకులకు తెగ నచ్చింది. వెంటనే వెళ్లి వాళ్లు కూడా చాలా పరిశోధనలు చేశారు. కానీ లియోనార్డ్ టీమ్‌కి మాత్రమే ఆ నాగరికత ఆనవాళ్లు కనిపించాయి అంటున్నారు. మరి నిజంగానే నాగరికత విలసిల్లిందా అనేది తేలాల్సి ఉంది.

భారీ రాతి గోళాలు, కోస్టారికా (Costa Rica Stone Spheres)

మధ్య అమెరికా దేశం కోస్టారికాలో భారీ రాతి గోళాలు గుండ్రంగా ఉండటం మాత్రమే కాదు.. వాటిని ఎవరు నిర్మించారో, ఎందుకు నిర్మించారో కూడా ఇప్పటికీ ఎవరికీ తెలియదు. అవి క్రీస్తుపూర్వం 600 ఏళ్ల నాటివిగా చెబుతున్నారు. 1930లో అరటిపండ్ల తోటను సాగుచేస్తున్న కూలీలు… పక్కనే ఉన్న అడవిని క్లీన్ చెయ్యాలని అనుకున్నారు. అలా వాళ్లు అడవిలోకి వెళ్లినప్పుడు ఈ రాళ్లు వాళ్లకు కనిపించాయి. అలా అవి వెలుగులోకి వచ్చాయి. అంతరిక్షం లోకి వెళ్లేందుకు ఈ రాళ్లు డైరెక్షన్ చూపిస్తాయని కొందరు అంటారు.. పూజారుల లాంటి స్థానికులు కొందరు… ఇవి దైవ రాళ్లుగా చెప్తారు.. ఏదేమైనా వీటి మిస్టరీ మాత్రం రహస్యంగానే ఉంది.

సిరియా ఆలయంలో పాదాల వింత (Syrian Temple Footprints):

సిరియా అంటే.. యుద్ధాలు., దాడులే మనకు గుర్తుకువస్తాయి.. వాటిని పక్కన పెట్టేద్దాం. ఇదే సిరియాలో ఎయిన్ దారా ఆలయం ఉంది. స్థానికంగా ఇది ఫేమస్ టెంపుల్. ఈ ఆలయ ఎంట్రన్స్ దగ్గర మీకు చాలా పాదముద్రలు కనిపిస్తాయి. అవి చాలా పెద్ద సైజులో ఉంటాయి. మన మనుషుల కాళ్ల కంటే 3 రెట్లు పెద్దవిగా ఇవి ఉంటాయి. అవి మనిషివా లేక జంతువువా అన్నది తేలలేదు. స్థానిక భక్తులు మాత్రం అవి దైవ పాదాలు అని నమ్ముతారు.. సింహాసనంపై కూర్చునేందుకు దైవమే ఆలయంలోకి నడిచి రావడం వల్ల ఆ ముద్రలు పడ్డాయి అని వారి విశ్వాసం.

సముద్రంలో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ (Millennium Technology):

ఇదో అంతుబట్టని మిస్టరీ. 1901లో యాంటీకీథెరా దీవి (Antikythera Island)లో ఓ విరిగిపోయిన నౌకను సముద్రంలో గుర్తించారు. ఓ మెకానిజం వారికి కనిపించింది. అది అత్యాధునిక టెక్నాలజీలాగా ఉంది. దానితో సౌర వ్యవస్థలో మళ్లీ మళ్లీ వచ్చే మార్పుల్ని గుర్చించడానికి వీలుంది. సూర్య గమనం, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, మార్స్, గురుగ్రహం, శనిగ్రహం ఎలా కదులుతాయో ఆ టెక్నాలజీ చెబుతోంది. ఫలానా తేదీల్లో ఏ నక్షత్రాలు ఉదయిస్తాయి, ఏవి అస్తమిస్తాయి అనే వివరాలు కూడా ఉంటాయట.. ఆ టెక్నాలజీ కలిగివున్న పరికరం ఎంతో అడ్వాన్స్‌డ్‌గా ఉంది. అలాంటిది మనం చూడాలంటే మనకు వెయ్యేళ్లు పట్టొచ్చు. మరి ఆ పరికరం ఎక్కడిది? ఎవరు చేశారు? ఎలా పనిచేస్తుంది అనేది ఎవరికీ తెలియదు.
మెక్సికో తీరంలో అవేంటి? (Mexico Ancient Engravings)
ఉత్తర అమెరికా ఖండానికి దక్షిణాన ఉన్న మెక్సికో దేశం ఎన్నో రహస్యాల అడ్డా. అక్కడి పసిఫిక్ తీరం వైపున సినాలోయ పెట్రోగ్లిఫ్స్ (Sinaloa petroglyphs) అనే ప్రాంతం ఉంది. అక్కడ అగ్ని పర్వతం పేలిన తర్వాత వచ్చినట్లుగా ఉండే చాలా రాళ్లు కనిపిస్తాయి. గుండ్రంగా ఉండే ఆ రాళ్లపై ఎవరో రాతలు రాసినట్లు ఉంటాయి. వాటిపై మనుషులు, జంతువులు, అర్థం కాని విచిత్ర బొమ్మలుంటాయి. అడ్డగీతలు, పూర్ణాలు, అల్లికల లాంటి గీతలుంటాయి. వాటిని ఎవరు గీశారో, ఆ రాళ్లు ఎక్కడి నుంచి వచ్చాయో ఎవరికీ తెలియదు. క్రీస్తుపూర్వం 1,000 ఏళ్ల నుంచి క్రీస్తుపూర్వం 300 ఏళ్ల మధ్య నాటివిగా చెబుతుంటారు. ఈ మిస్టరీని మీరు ఛేదిస్తే.. మీ పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version