సీఎం సీటుకు గురి పెట్టిన రేవంత్ రెడ్డి.. బిగ్ ప్లాన్ ఇదేనా..?

-

కొడితే ఏనుగు కుంభస్థలమే కొట్టాలి.. ఇదీ తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి పాలసీ.. అందుకే ఆయన చాలా దూకుడుగా ఉంటారురాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటారుసొంత నియోజకవర్గం కోడంగల్ లో ఓడినా.. మళ్లీ మల్కాజ్ గిరిలో ఎంపీగా గెలిచాడంటే.. రేవంత్ క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చుతెలంగాణ కేసీఆర్ కుటుంబాన్ని ఓ రేంజ్ లో విమర్శించే నాయకుల్లో రేవంత్ ముందు వరుసలో ఉంటారు.

అలాంటి రేవంత్ ఇప్పుడు తెలంగాణ సీఎం సీటుకు గురిపెట్టినట్టు తెలుస్తోందిఇందుకోసం ఓ మాస్టర్ ప్లాన్ కూడా రెడీ చేసుకుంటున్నారుఅదేమిటంటే.. తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర.

త్వరలో రేవంత్ రెడ్డి సుదీర్ఘమైన పాదయాత్రకు స్కెచ్ వేస్తున్నారటఈమేరకు ఆయన తన స్నేహితులకు సంకేతాలు ఇస్తున్నారుతెలంగాణలో కేసీఆర్ పాలన అరాచకానికి చేరిందని చెబుతున్న ఆయన.. కేసీఆర్ ఆలోచనైనా మార్చాలి.. లేదా కేసీఆర్‌ నే మార్చాలి అంటున్నారు.

కేసీఆర్ మనసు మార్చడం మన చేతుల్లో లేదు కాబట్టి.. కేసీఆర్ నే సీఎం సీటు నుంచి మార్చాలని చెబుతున్నారుతెలంగాణ పల్లెల్లో దారుణమైన పరిస్థితులు ఉన్నాయంటున్న రేవంత్ రెడ్డి… తాను రాష్ట్రంలోని ప్రతి పల్లెకూ వస్తానని చెబుతున్నారుఅంటే పాదయాత్ర చేస్తే తప్ప ఈ వాదన నిజం కాదు.. అంటే రేవంత్ రెడ్డి మదిలో కూడా సుదీర్ఘమైన పాదయాత్ర చేయాలనే కోరిక ఉందన్నమాటఎప్పటికైనా తెలంగాణ సీఎం కావాలని తపిస్తున్న రేవంత్ రెడ్డి.. అందుకు పాదయాత్రే కరెక్ట్ ప్లాన్ అని భావిస్తున్నారు.

రేవంత్ రెడ్డి ఇలా భావించడానికి లాజిక్ కూడా ఉందిగతంలో గ్రూపు రాజకీయాల నాయకుడుగానో ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డికి మాస్ లీడర్.. ప్రజానాయకుడిగా గుర్తింపు వచ్చింది సుదీర్ఘమైన పాదయాత్ర ద్వారానే.. వైఎస్ తర్వాత చంద్రబాబు కూడా 2014 ఎన్నికల ముందు పాదయాత్ర చేశారు..2014లో అధికారంలోకి వచ్చారుఆ తర్వాత వైఎస్ జగన్ కూడా సుదీర్ఘ పాదయాత్ర చేశారుప్రజలకు చేరువయ్యారు. 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చారుఅందుకే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డికి కూడా పాదయాత్రపై మనసు పడిందంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news