వచ్చే ఎన్నికల్లో మళ్ళీ కొడంగల్ బరిలోనే దిగుతానని రేవంత్ రెడ్డి చెప్పేశారు. నెక్స్ట్ కొడంగల్‌లో పోటీ చేయడం గ్యారెంటీ అని తాజాగా కొండగల్‌లో జరిగిన కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చెప్పారు. అయితే ఇది ముందు నుంచి అనుకుంటున్న విషయమే…ప్రస్తుతం మల్కాజిగిరి ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి…మళ్ళీ కొడంగల్ బరిలోనే దిగుతారని అంతా అనుకుంటున్నారు. అయితే ఈ సారి మాత్రం టీఆర్ఎస్‌కు గెలిచే అవకాశం ఏ మాత్రం ఇవ్వరని కాంగ్రెస్ శ్రేణులు గట్టిగా చెబుతున్నాయి.
గతంలో కొండగల్ నియోజకవర్గం అనేది పెద్దగా ఎవరికి తెలియదు. కానీ రేవంత్ రెడ్డి అక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించిన తర్వాతే కొడంగల్ అంటే అందరికీ తెలిసింది. ఇక కొడంగల్‌లో బలంగా ఉన్న రేవంత్ రెడ్డికి ఎలాగైనా చెక్ పెట్టాలని చెప్పి టీఆర్ఎస్ నానా రకాలుగా ప్రయత్నించింది. చివరికి 2018 ఎన్నికల్లో ఆయనని ఓడించింది. పలు రకాల వ్యూహాలతో కొడంగల్‌లో రేవంత్ రెడ్డిని ఓడించారు.
అలా ఓడిపోయాక రేవంత్ 2019 పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచారు. అలాగే పిసిసి అధ్యక్షుడు కూడా అయ్యారు. ఇలా పిసిసి అధ్యక్షుడుగా ఉన్న రేవంత్ రెడ్డి…నెక్స్ట్ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. ఎందుకంటే పిసిసి అధ్యక్షుడే ఓడిపోతే కాంగ్రెస్ పరువు పోతుంది. అయితే మళ్ళీ కొడంగల్ బరిలో దిగి రేవంత్ సత్తా చాటడం గ్యారెంటీ అని తెలుస్తోంది. ఇప్పటికే అక్కడ టీఆర్ఎస్‌పై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు.
ఈ పరిస్థితుల్లో కొడంగల్‌లో రేవంత్ గెలవడం సులువే. పైగా అక్కడ 75 వేల కాంగ్రెస్ సభ్యత్వాలు చేశారు. అసలు 2018లో రేవంత్‌కు పడిన ఓట్లు 71 వేలు. ఇప్పుడు 75 వేలు సభ్యత్వాలే చేశారంటే…కొడంగల్‌లో పరిస్తితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఈ సారి మాత్రం కొడంగల్‌లో రేవంత్ గెలుపుని ఆపడం కారుకు అసాధ్యమే అని చెప్పొచ్చు.