BREAKING : పిసిసి చీఫ్ రేవంత్ అరెస్ట్ !

-

తెలంగాణ కాంగ్రెస్ పిసిసి అధ్యక్షులు, మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు రేవంత్ రెడ్డి మరోసారి హౌస్ అరెస్ట్ అయ్యారు. కాసేపటి క్రితమే జూబ్లీ హిల్స్ పోలీసులు కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని అరెస్టు చేశారు. ఇవాళ వరంగల్ జిల్లాలో రచ్చబండ కార్యక్రమాన్ని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నిన్న కీలక ప్రకటన చేసింది కాంగ్రెస్ పార్టీ.

ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇవాళ ఉదయం నుంచి తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటిదగ్గర భారీ బలగాలను మొహరించారు పోలీసులు. వరంగల్ రచ్చబండ కార్యక్రమానికి… వెళ్లకుండా అడ్డుకునేందుకు రేవంత్ రెడ్డి ని అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హౌస్ అరెస్ట్ చేయడంపై రేవంత్ రెడ్డి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా రెండు రోజుల క్రితం కూడా రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news