హైదరాబాద్ లోని నాంపెల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నుమాయిష్ ను జనవరి 1 నుంచి ప్రారంభం కానుంది. 81 వ అఖిల భారత పారిశ్రామిక వస్తు ప్రదర్శనను రేపు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళి సై ప్రారంభిస్తారు. ఈ భారీ ప్రదర్శనను కరోనా నేపథ్యంలో కోవిడ్ నిబంధనలను పాటిస్తు నిర్వహిస్తామని నిర్వహకులు తెలిపారు. అలాగే మొత్తం 20 ఎకరాలలో ఈ భారీ ప్రదర్శన ఉండనుంది. ఈ 20 ఎకరాల్లో కేవలం ఆరు ఎకరాల్లో మాత్రమే దుకాణాలు ఉండనున్నాయి.
మిగితా స్థలాన్ని సందర్శకుల కోసం ఖాళీగానే ఉంచుతున్నారు. అలాగే ఈ సారి నుమాయిష్ లో దాదాపు 1500 స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు. అలాగే కరోనా విస్తరిస్తుండటంతో ప్రదర్శనకు రావలంటే.. తప్పక మాస్క్ ధరించాలని నిబంధనను పెట్టారు. అలాగే ఎగ్జిబిషన్ గ్రౌండ్ లోనే ఉచిత వ్యాక్సినేషన్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు. అయితే రాష్ట్రంలో కరోనా వైరస్, ఓమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతన్న నేపథ్యంలో నుమాయిష్ నిర్వహించడం కాస్త ఆందోళన కలిగిస్తుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.