కేసీఆర్ ప్రెస్ మీట్ దుర్యోధనుడి ఏకపాత్రాభినయంలా ఉంది : రేవంత్ రెడ్డి

-

కేసీఆర్ ప్రెస్ మీట్ పై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. బీజేపీ, టిఆర్ఎస్ రెండు పార్టీలు ఒక్కటే.. ప్రజలను మోసం చేయడంలో ప్రజలను పక్కదారి పట్టించడంలో ఇద్దరు దొంగలే అంటూ రేవంత్ ఫైర్ అయ్యారు. కేసీఆర్, మోడీ.ఇద్దరు కలిసి రైతులను మోసం, నష్టం చేస్తున్నారని రేవంత్ అన్నారు. పంజాబ్ తో సహా 24 రాష్ట్రాలలో పెట్రోల్, డీజిల్ పైన వ్యాట్ తగ్గించినపుడు తెలంగాణ లో ఎందుకు తగ్గించరు అని రేవంత్ ప్రశ్నించారు. ప్రజలను దోచుకోవడంలో అవినీతి సొమ్ము దాచుకోవడంలో కేసీఆర్,మోడీ ఇద్దరు ఇద్దరే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి, గుండు కలిసి ప్రజలకు గుండు కొడుతున్నారు అంటూ వ్యాఖ్యానించారు.

ప్రగతి భవన్ లో కేసీఆర్ ప్రెస్ మీట్ మయ సభలో దుర్యోధనుడి ఏకపత్రాభినయం లాగా ఉంది అంటూ వ్యాఖ్యానించారు. వరి వేయమని కేంద్రానికి చెప్పి వరి వేస్తే ఉరి అని కేసీఆర్ తెలంగాణ రైతులకు మరణ శాసనం రాసాడు అంటూ రేవంత్ అన్నారు. కేసీఆర్ రాజకీయాలకు తెలంగాణ ప్రజలు ఉరి పెట్టె రోజులు దగ్గర్లోనే ఉన్నాయని రేవంత్ అన్నారు. రాయచూరు ప్రజలు తెలంగాణ మమ్మల్ని కలపాలని అంటున్నారు అని కేసీఆర్ అంటున్నారు.. తెలంగాణ ప్రజలు కేసీఆర్ ను బంగాళాఖాతంలో కలుపుతారు అంటూ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్ని రోజులు మొద్దు నిద్ర నటించిన కేసీఆర్ ఇప్పుడు మోడీ పై బీజేపీ పైన యుద్ధం అంటూ మరోసారి నటిస్తున్నాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్, మోడీ దొంగ నాటకాలకు తెలంగాణ ప్రజలు బుద్ధి చెవుతారని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news