చత్తీస్ గడ్ రాష్ట్రంలో కాల్పుల కలకలం రేగింది. సీఆర్పీఎఫ్ బెటాలియన్ లో తొటి జవాన్ల పైకి మరో జవాన్ కాల్పులు జరిపాడు. ఈ దాడిలో ముగ్గురు జవాన్లు మరణించగా, మరో నలుగురు జవాన్లు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఈ ఘటన చత్తీస్ గడ్ రాష్ట్రం సుకుమా జిల్లా మారాయి గూడెం లింగంపల్లి బేస్ క్యాంపులో చోటు చేసుకుంది. సోమవారం తెల్లవారుజామున ఘటన చోటుచేసుకుంది. ఘటన జరిగిన ప్రాంతం చత్తస్ గడ్, తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఉంటుంది. గాయపడిన వారిని భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనకు కారణమైన జవాన్ ను అదుపులోకి తీసుకున్నారు అధికారులు. చనిపోయిన వారు, గాయపడిన వారు వివిధ రాష్ట్రాలకు చెందిన వారు. అయితే కాల్పులు ఎందుకు జరిపారనే దానిపై వివరాలు తెలియాల్సి ఉంది.
గతంలో కూడా జవాన్ల మధ్య గొడవలు జరిగాయి. ఇలాగే జవాన్లు తోటి జవాన్లపై కాల్పులు జరిపిన ఘటనలు ఉన్నాయి. మావోయిస్టులను అదుపు చేసేందకు జవాన్లు నిత్యం కూంబింగ్, భద్రతలో నిమగ్నం అయి ఉంటారు. అయితే ఇక్కడ జవాన్ల కు ఎక్కువ సెలవులు ఇచ్చే పరిస్తితి ఉండదు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు కావడంతో సెలవులు ఇవ్వని పరిస్థితి ఉంది. దీంతో అసహనంతో జవాన్లు కాల్పులు దిగుతున్నారని తెలుస్తోంది. గతంలో కూడా సుకుమా, బీజాపూర్ జిల్లాల్లో ఈ తరహా దాడులు జరిగాయ.