ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడాలన్నదే మా విధానం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సిఐఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి రేవంత్ హాజరయ్యారు. రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ పెట్టుబడిదారులు పారిశ్రామికవేత్తలకి అన్ని విధాలుగా అండగా ఉంటామని అన్నారు.
రాజకీయాలు ఎలా ఉన్నా వైయస్ చంద్రబాబు కేసీఆర్ హైదరాబాద్ అభివృద్ధిని కొనసాగించారని అభివృద్ధి విషయంలో మా ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందులు లేవని రేవంత్ రెడ్డి అన్నారు నగర అభివృద్ధి కోసం గత పాలకులు తీసుకున్న మంచి నిర్ణయాలని కొనసాగిస్తామని తెలంగాణలో విద్య ఉపాధి అవకాశాలు కల్పనలో సి ఐ తో కలిసి ముందుకు నడుస్తామని అన్నారు.