చెప్పులతో… మీకు చెప్పుల దండ వేయిస్తా : టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు రేవంత్ కౌంటర్

-

పార్టీ మారిన ఎమ్మెల్యే ల పై రేవంత్ రెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. మీరు చెప్పులతో కొట్టుడు కాదు… మీకు చెప్పుల దండ వేయిస్తానని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు వార్నింగ్‌ ఇచ్చారు.దానం నాగేందర్ కి సిగ్గు కూడా లేకుండా మాట్లాడుతున్నాడని.. కాంగ్రెస్ టికెట్ ఇవ్వకుంటే రోడ్డు మీద పిచ్చి కుక్క కంటే హీనంగా ఉండే వాడివని మండిపడ్డారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే… వీపులు విమాన మోత మోగుతాయని హెచ్చరించారు. పార్టీ మారిన ఎమ్మెల్యే లు… రద్దైన వెయ్యి రూపాయల నోట్లు లాంటి వాళ్ళు అని… మీకు చీము.. నెత్తురు ఉంటే ఎమ్మెల్యే లుగా రాజీనామా చేయాలన్నారు.

మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోరని.. మీరు ఊర్లకు వస్తే కాంగ్రెస్ కార్యకర్తలు ఉరికించి కొడతారని పేర్కొన్నారు. ఇన్ని రోజులు మా నాయకులు మర్యాదగా ఉండాలని అనుకున్నారని…ఇప్పుడు మీ అందరి తాటా తీయిస్తానని హెచ్చరించారు.

తెలంగాణ ఉద్యమంలో ఉన్న ఒక్కడు కూడా మంత్రి వర్గంలో లేడని… తెలంగాణ ద్రోహులు రాష్ట్రాన్ని ఏలుతున్నారని ఫైర్‌ అయ్యారు. ఎర్రబెల్లి, తలసాని, సబితా, గంగుల, పోచారం ఇలా అందరూ తెలంగాణ ఉద్యమంలో ద్రోహం చేసిన వాళ్ళేనని వెల్లడించారు రేవంత్‌. 7 వ తేదీ తర్వాత… మిమ్మల్ని కొరివి దయ్యాలను ఊరు దాటించినట్టు తరిమెస్తామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version