తెలంగాణలో వచ్చేది మా ప్రభుత్వమే: రేవంత్ రెడ్డి

-

కాంగ్రెస్ ను తెలంగాణలో అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ప్రస్తుతం పాదయాత్ర చేస్తున్న రేవంత్ ప్రజల్లోకి కాంగ్రెస్ ను తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అధికార పార్టీ టీఆర్ఎస్ తప్పిదాలను హైలెట్ చేసి కాంగ్రెస్ పై జనాల చూపు పడేవిధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన పార్టీకి కనీసం ఒక్క ఛాన్స్ అయినా ఇవ్వాలంటూ రేవంత్ పదే పదే ప్రజలను కోరుతున్నారు.పాదయాత్ర నిర్వహిస్తున్న ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ రేవంత్ ఈ నినాదాన్ని ఉపయోగిస్తూ జనాల్లో సెంటిమెంట్ ను రగిల్చే ప్రయత్నం చేస్తున్నారు.

‘తెలంగాణ ఇవ్వడమే కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పా ! పదవుల కోసం కాదు ఆవేదనతో ఈ ప్రశ్న అడుగుతున్నా, తెలంగాణ ఇవ్వడమే కాంగ్రెస్ చేసిన ద్రోహమా ? కాంగ్రెస్ పార్టీని ఎందుకు గెలిపించరు ? 1200 మంది యువకులు బలిదానాలకు చలించి ఏ అమ్మకు కడుపుకోత ఉండకూడదని సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు.రాజకీయంగా నష్టపోయినా, సోనియాగాంధీ తెలంగాణ కు కలను సాకారం చేశారు .అంత గొప్పం త్యాగం చేస్తే సోనియాగాంధీ రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత తెలంగాణ సమాజం మీద లేదా అంటూ రేవంత్ పదేపదే ప్రశ్నిస్తున్నారు.రేవంత్ పాదయాత్ర జరుగుతున్న అన్నిచోట్ల ఇదే సెంటిమెంటును రగుల్చుతూ రేవంత్ ప్రజల్లో ఆలోచన రేకెత్తిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version