మరోసారి ఇవాళ ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్ !

-

మరోసారి ఇవాళ ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పయనం కానున్నారు.  ఇవాళ ఉ.10 గంటలకు కర్ణాటక నుంచి హస్తినకు బయల్దేరనున్నారు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి. ఢిల్లీలో మన్మోహన్ సింగ్ పార్ధివ దేహానికి నివాళి అర్పించనున్నారు రేవంత్ రెడ్డి. అనంతరం సాయంత్రం ఢిల్లీ నుంచి తిరిగి హైదరాబాద్ కు రానున్నారు సీఎం రేవంత్‌ రెడ్డి.

Revanth to pay homage to Manmohan Singh’s mortal remains in Delhi

 

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణించడాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు ఇవాళ అంటే శుక్రవారం నాడు సెలవు దినం ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది రేవంత్‌ రెడ్డి సర్కార్. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ సెలవ దినంతో పాటు వారం రోజులు సంతాపదినాలను పాటించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news