రేవంత్ రెడ్డి ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారా..?

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కొండగల్ నియోజకవర్గాన్ని వదిలేస్తున్నారా..? వచ్చే ఎన్నికల్లో కొత్త నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారా..? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. లోక్‌సభకు గతంలో పోటీ చేసిన వారు.. ఇప్పుడు ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్తగా పనిచేస్తున్న సునీల్ కనుగోలు కొత్త సమీకరణాలకు తెర లేపినట్లు సమాచారం. అయితే రేవంత్ రెడ్డి ఏ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తారనే విషయం ప్రశ్నార్థకమైంది. ఈయనతోపాటు మరికొంత మంది ప్రజాప్రతినిధులు వేరే వేరే అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది.

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

దీంతో కొందరు సీనియర్ నాయకులు పార్టీ ముఖ్య నేతలతో తమ ఆలోచనలు పంచుకున్నారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్‌లో నేతల నియోజకవర్గాల మార్పు అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది. కొందరు సీనియర్లు తమ వారసుల భవిష్యత్ కోసం కొత్త ప్రతిపాదనలతో మంతనాలు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం మల్కాజ్‌గిరి ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి.. ఆ లోక్‌సభ పరిధిలోని ఎల్‌బీనగర్ నుంచి పోటీ చేస్తున్నట్లు తెలుస్తోంది. కొడంగల్ నియోజకవర్గం నుంచి రేవంత్ రెడ్డి తమ్ముడు తిరుపతి రెడ్డిని బరిలోకి దింపే అవకాశం కనిపిస్తోంది.