మహేష్ బాబు వ్యాఖ్యలపై వర్మ కామెంట్స్..

-

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సినిమా సర్కారు వారి పాట సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే.. మహేష్ బాబు నిర్మాతగా.. తెరకెక్కుతున్న చిత్రం మేజర్.. అయితే ఈ సినిమా కూడా విడుదలకు సిద్ధమైంది. అయితే ఈ సినిమా ప్రమోషన్లలో మహేష్ బాబు చేసిన వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారాయి. మహేశ్ బాబు.. బాలీవుడ్ లో నటించడంపై ప్రశ్న ఎదుర్కొన్నారు. తనకు హిందీ పరిశ్రమ నుంచి ఎక్కువ అవకాశాలు రాలేదని, తనను బాలీవుడ్ భరించలేదని (రెమ్యునరేషన్ అయి ఉండొచ్చు) ఆయన బదులిచ్చారు. ఈ వ్యాఖ్యల పట్ల బాలీవుడ్ లో ఎన్నో సినిమాలు చేసిన రామ్ గోపాల్ వర్మ స్పందించారు.

RGV shares Mahesh Babu video from Bazaar Rowdy

మహేశ్ బాబు వ్యాఖ్యల్లోని మర్మమేంటో తనకు అర్థం కాలేదన్నారు. ‘‘ఒక నటుడిగా అది అతడి ఎంపిక. బాలీవుడ్ భరించలేదన్న ఆయన వ్యాఖ్యల్లోని అర్థం ఏంటో నిజాయతీగా నాకు అర్థం కాలేదు. ఇటీవల దక్షిణాది సినిమాలను గమనించినట్టయితే.. అవి హిందీలోకి డబ్బింగ్ అయి విడుదలయ్యాయి. వారు ఖర్చు చేసిందంతా వెనక్కి వచ్చేసింది. బాలీవుడ్ ఒక కంపెనీ కాదు. మీడియా ఇచ్చిన లేబుల్ మాత్రమే. విడిగా ఒక మూవీ కంపెనీ లేదా నిర్మాణ సంస్థ ఇంత బడ్జెట్ తో నటించాలని కోరొచ్చు. కనుక బాలీవుడ్ ను సాధారణీకరించి ఎలా చెప్తారు?’’ అని రామ్ గోపాల్ వర్మ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news