గొలుసులతో కట్టేయకపోతే కరుస్తాడేమో.. కే.ఏ పాల్ పై ఆర్జివి ట్వీట్..!

46

ఆర్జివి ట్వీట్ చేశాడు అంటే అందులో ఏదో ఒక వివాదం ఉన్నట్టే. తన మనసులో ఏముందో అది ముక్కుసూటిగా చెప్పే వర్మ లేటెస్ట్ గా కే.ఏ పాల్ మీద వ్యగాస్త్రాలు సంధించాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రజాశాంతి పార్టీ అధినేత కే.ఏ పాల్ ఓ పోలింగ్ స్టేషన్ నుండు ఉరికి వచ్చే వీడియో వైరల్ గా మారింది. ఆ వీడియో చూసిన వర్మ పాల్ ను గొలుసులతో కట్టేయకపోతే కర్చేలా ఉన్నాడని అన్నారు.

కే.ఏ పాల్ వర్సెస్ ఆర్జివి ఈ గొడవ ఎక్కడ మొదలైంది అంటే.. ఏదో మీటింగ్ లో పాల్ ను కలిసిన వర్మ అతని కాళ్ల దగ్గర ఒంగి ఉన్న పిక్ ఒకటి బయటకు వచ్చింది. అయితే దానికి పాల్ వర్మ తన కాళ్లు మొక్కాడంటూ కామెంట్ చేయగా వర్మ మాత్రం కాళ్లు లాఇగ్ కింద్ర పడేద్దామని అలా చేశానని అన్నారు. ఇప్పుడు ఏకంగా పాల్ ను గొసులతో కట్టేయాలని అంటున్నాడు. మరి వర్మ కామెంట్స్ కు కే.ఏ పాల్ ఎలా స్పందిస్తాడో చూడాలి.