అక్కడ కూడా రీపోలింగ్ నిర్వహించాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. అయితే.. ఆ రెండు ప్రాంతాల్లో రీపోలింగ్ ఎప్పుడు నిర్వహించేది మాత్రం ఈసీ ఇంకా తెలపలేదు.
ఏపీలో జరిగన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్ని ఘర్షణలు చోటు చేసుకున్నాయో తెలిసిందే. కొన్ని ఈవీఎంలు కూడా సరిగ్గ పని చేయలేదు. దీనికి ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు. అయితే.. టీడీపీ, వైఎస్సార్సీపీ నేతల మధ్య జరిగిన ఘర్షణల వల్ల మాత్రం రెండు ప్రాంతాల్లో రీపోలింగ్ నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నదన ఈసీ. అవును.. వాళ్ల ఘర్షణ వల్ల పోలింగ్‌పై ప్రతికూల ప్రభావం చూపిందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నదట ఈసీ. ఆ రెండు ప్రాంతాలు కూడా గుంటూరు జిల్లాకు చెందినవే. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని 244వ పోలింగ్ బూత్‌తో పాటు నరసారావుపేటలోని 94వ పోలింగ్ బూత్‌లో రీపోలింగ్ నిర్వహించాలని ఈసీ ఆదేశించింది. గుంటూరు కలెక్టర్ ఆ రెండు పోలింగ్ బూత్‌లకు సంబంధించి ఈసీకి నివేదిక అందజేసిన తర్వాతనే ఈ నిర్ణయం తీసుకున్నారట.
గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని 244వ పోలింగ్ బూత్ వద్ద పోలింగ్ తేదీ నాడు అర్ధరాత్రి వరకు పోలింగ్ జరిగిందట. అయితే.. సాయంత్రం 6 కాగానే ఎన్నికల అధికారులు వారికి టోకెన్లు ఇచ్చారట. ఆ పోలింగ్ కేంద్రానికి ప్రహారీ లేకపోవడంతో అంతా గందరగోళం ఏర్పడి చాలామంది క్యూలో నిలబడ్డారట. టోకెన్లు ఇచ్చిన సంఖ్య కంటే ఎక్కువ మంది ఓటింగ్‌లో పాల్గొన్నారట. అక్కడ పోలింగ్ 11.30 వరకు జరిగిందట. అయితే.. సాయంత్రం తర్వాత అక్కడ పోలింగ్‌లో అక్రమాలు చోటు చేసుకున్నాయని తెలుసుకున్న ఈసీ అక్కడ రీపోలింగ్ పెట్టాలని భావిస్తోందట.
దాంతో పాటు.. నరసారావుపేటలోని కేసానుపల్లిలో ఉన్న 94వ బూత్‌లో కూడా పీవో తప్పిదం వల్ల రీపోలింగ్ నిర్వహించాల్సి వస్తోందట. మాక్ పోలింగ్ తర్వాత ఈవీఎం నుంచి ఆ ఓట్లను తొలగించకుండానే ఓటింగ్‌ను ప్రారంభించారట. దీంతో అక్కడ కూడా రీపోలింగ్ నిర్వహించాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. అయితే.. ఆ రెండు ప్రాంతాల్లో రీపోలింగ్ ఎప్పుడు నిర్వహించేది మాత్రం ఈసీ ఇంకా తెలపలేదు.