మంత్రి ఎర్రబెల్లికి RGV వార్నింగ్‌.. కొండా సురేఖతో సెల్ఫీ వీడియో రిలీజ్‌ !

టాలీవుడ్‌ సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ… గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పుడు రాజకీయా నాయకులపై సినిమాలు తీస్తూ.. వార్తల్లో నిలుస్తారు. ఈ నేపథ్యంలో తాజాగా కొండా సురేఖ దంపతుల జీవిత చరిత్రపై బయోపిక్‌ తీశారు. ఈ సినిమాకు కొండా అనే పేరు కూడా పెట్టారు రామ్‌ గోపాల్‌ వర్మ. అయితే.. ఈ సినిమాలో తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి, చల్లా ధర్మారెడ్డికి వ్యతిరేకంగా సన్నివేశాలు ఈ సినిమాలో చిత్రీకరించారు.

దీంతో కొండా సినిమాను ఆపేందుకు మొదటి నుంచి టీఆర్‌ఎస్‌ నేతలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇక ఇవాళ ఈ సినిమా ట్రైలర్‌ ను వర్మ విడుదల చేయనున్నారు. ఈ ట్రైలర్‌ ను కూడా అడ్డుకునేందుకు.. కొండా సురేఖ ఇంటికి పోలీసులు వెళ్లారు. ఈ నేపథ్యంలో.. కొండా సురేఖతో కలిసి… వర్మ ఓ సెల్పీ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోను మంత్రి ఎర్రబెల్లి, చల్లా ధర్మారెడ్డికి కొండా సురేఖ స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. తమ సినిమా ట్రైలర్‌ ను మీరు ఆపేలేరంటూ… బండ బూతులు తిట్టారు. కాగా.. ఇవాళ 10.26 గంటలకు ఈ సినిమా ట్రైలర్‌ ను విడుదల చేయనున్నారు వర్మ.