కృష్ణంరాజు మృతి…మీకు ఇదే గతి..ఛీ సిగ్గు..సిగ్గు అంటూ టాలీవుడ్ కు RGV వార్నింగ్

-

టాలీవుడ్‌ నటుడు కృష్ణంరాజు నిన్న మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే.. కృష్ణంరాజు మృతి పై సంచలన దర్శకుడు వర్మ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. కృష్ణంరాజు నేపథ్యంలో.. రెండు రోజుల పాటు షూటింగ్లు ఆపండి అంటూ ట్వీట్‌ చేశారు ఆర్జీవీ. మన చావుకి విలువ ఉండాలంటే పోయిన కృష్ణంరాజు గారి లాంటి పెద్ద మనిషికి విలువ ఇద్దాం .. కనీసం రెండు రోజులు షూటింగ్ ఆపుదామని డిమాండ్‌ చేశారు.

మనసు లేకపోయినా ఓకే. కనీసం మన చావుకి విలువ ఉండాలంటే పోయిన కృష్ణంరాజుగారి లాంటి పెద్దమనిషికి విలువ ఇద్దాం .. కనీసం రెండు రోజులు షూటింగ్ ఆపుదాం. డబ్బు ఎక్కువ ఖర్చు అయిపోతోంది అని నెల రోజులు షూటింగ్ ఆపేసిన పరిశ్రమ మనదని గుర్తు చేశారు.

నేను కృష్ణగారికి,మురళీ మోహన్ గారికి, బాలయ్యకి , ప్రభాస్ కి ఈ విషయం మీద మనవి చేసేదేంటంటే రేపు ఇదే దుస్థితి మీలో ఎవరికీ కూడా తప్పదని హెచ్చరించారు. ఒక మహోన్నత కళాకారుడికి ఇవ్వలేని మహోన్నత వీడ్కోలు మన మీద మనమే ఉమ్మేసుకోవడం లాంటిదని వివరించారు ఆర్జీవీ. గొప్ప నిర్మాత కోసం ఒక్క రోజు కూడా షూటింగ్ ఆపలేని అత్యంత స్వార్ధపూరిత తెలుగు సినిమా పరిశ్రమ కి నా జోహార్లు. సిగ్గు! సిగ్గు! అని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version