సుశాంత్ సింగ్ ఆత్మహత్య విషయమై బీహార్ మంత్రి మహేశ్వర్ హజారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి విష కన్య అని అన్నారు. ఆమె ఓ సుపారి కిల్లర్ అని వ్యాఖ్యానించారు. ఆమె ఓ విష సర్పమని అన్నారు. సుశాంత్ సింగ్‌ను ఆమె తన చర్యలతో చంపేసిందని అన్నారు.
సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ బ్యాంక్ అకౌంట్ల నుంచి భారీ మొత్తంలో డబ్బు రియా చక్రవర్తి, ఆమె సోదరుడి అకౌంట్లకు గతంలో ట్రాన్స్‌ఫర్ అయినట్లు బీహార్ పోలీసులు ఇప్పటికే గుర్తించారు. సుశాంత్ బ్యాంక్ అకౌంట్ స్టేట్‌మెంట్లు మీడియా సంస్థలకూ లభ్యమయ్యాయి. ఈ క్రమంలో సుశాంత్ ఆత్మహత్య కేసు రియా మెడకు చుట్టుకుంటుండగా.. బీహార్ పోలీసులు ఈ కేసులో విచారణను వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే అక్కడి మంత్రి హజారి ఈ వ్యాఖ్యలు చేయడం సంచలనం సృష్టిస్తోంది.
సుశాంత్ ఆత్మహత్య చేసుకోలేదని, అతనిది హత్యేనని హజారి అన్నారు. ఆమె విషకన్య అని ఆమె ద్వారా సుశాంత్‌ను చంపించారని ఆరోపించారు. కాగా ఇప్పటికే సుశాంత్ తండ్రి కేకే సింగ్ రియా చక్రవర్తి సహా మొత్తం 6 మందిపై పాట్నా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో బీహార్ పోలీసులు కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు.