అసలు డ్రా నా ఆప్షన్ కాదు… పంత్ కీలక వ్యాఖ్యలు

-

గత వారం భారత్… ఆస్ట్రేలియాలో గెలిచిన టెస్ట్ ప్రపంచ వ్యాప్తంగా సంచలనం అయింది. ఈ మ్యాచ్ లో రిషబ్ పంత్ ఆడిన ఇన్నింగ్స్ ప్రపంచ క్రికెట్ లో సంచలనం అయింది. ఇక ఇదిలా ఉంటే అక్కడి నుంచి కూడా రిషబ్ పంత్ సోషల్ మీడియాలో ప్రధాన మీడియాలో హాట్ టాపిక్ అయ్యాడు. ఇక ఇదిలా ఉంటే… బెన్ స్టోక్స్ హెడింగ్లీలో ఆడిన ఇన్నింగ్స్… కుసల్ పెరెరా డర్బన్ లో ఆడిన ఇన్నింగ్స్ తో పంత్ ఇన్నింగ్ ని పోలుస్తున్నారు.

rishab panth

నాల్గవ టెస్ట్ యొక్క ఆఖరి రోజున షుబ్మాన్ గిల్ 91 పరుగులు చేసిన తర్వాత పంత్ అజేయంగా 89 పరుగులు చేసి జట్టుని గెలిపించాడు. ఇది గబ్బాలో అత్యధిక విజయవంతమైన పరుగుల చేజ్ (328). 3 ఓవర్లు మిగిలి ఉండగానే మ్యాచ్‌ను ముగించాడు. తరువాత ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ట్రోఫీని అందుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఒక ఛానల్ తో అతను మాట్లాడుతూ…

డ్రా అనే ఆలోచన తన ఎంపిక అసలు ఎప్పుడు కాలేదని టార్గెట్ ని ఫాలో అయ్యా అని చెప్పాడు. నా దృష్టి అంతా విజయం మీదనే ఉందని చెప్పాడు. “సాధారణ క్రికెట్ ఆడే మనస్తత్వం ఎప్పుడూ ఉంటుంది. మొదటి ఇన్నింగ్స్‌లో జట్టు మేనేజ్‌మెంట్ కూడా దీని గురించి మాట్లాడింది. పరుగులు చేయడం, షాట్ ఆడే బంతులను క్యాష్ చేసుకోవడం, క్రీజ్ లో నిలబడి మీరు చేయగలిగినదంతా చేయండి అని చెప్పిందని పేర్కొన్నాడు. నా ఆలోచన ఎప్పుడూ గెలవడమే.. నేను ప్రతి ఆట గెలవాలని కోరుకుంటున్నాను, డ్రా ఎప్పుడూ ద్వితీయ ఎంపిక” అని తెలిపాడు.

Read more RELATED
Recommended to you

Latest news