బ్రిటన్ ఆర్ధిక మంత్రిగా భారత సంతతి ఎంపీ రిషి సునక్ ఇటీవల భాద్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఆయన ఆర్ధిక మంత్రిగా భాద్యతలు చేపట్టిన తరువాత తొలిసారి సభలో తన వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అయితే ఈ వార్షిక బడ్జెట్ లో వలసదారులకు షాక్ ఇచ్చే నిర్ణయమే తీసుకున్నట్లు తెలుస్తుంది. బ్రిటన్ లాంగ్ టర్మ్ వీసా ఖర్చు పెరగనున్నట్లు తెలుస్తుంది. రిషి సునక్ తన వార్షిక బడ్జెట్ లో భాగంగా ఇమ్మిగ్రేషన్ హెల్త్ సర్ ఛార్జ్(ఐ హెచ్ ఎస్) ను 400 పౌండ్ల నుంచి 624 పౌండ్ల కు పెంచనున్నట్లు సమాచారం. బ్రిటన్ ఎన్‌హెచ్ఎస్ నుంచి వలసదారులు ప్రయోజనం పొందుతున్నారు.ఎన్‌హెచ్ఎస్‌పై ఇప్పటికే అదనపు సర్ ఛార్జీ ఉన్నప్పటికీ, ఇది ప్రజలు పొందే ప్రయోజనాలను సరిగ్గా ప్రతిబింబించదు. అందువల్ల తాము ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఇమ్మిగ్రేషన్ హెల్త్ సర్‌ఛార్జ్‌ని 624 పౌండ్లకు పెంచుతున్నామని అయితే ఇందులో పిల్లలకు రాయితీ ఉంటుందని రిషి సునక్ బుధవారం బ్రిటన్ హౌస్ ఆఫ్ కామన్స్‌లో తెలిపారు. అయితే 18 సంవత్సరాల లోపు పిల్లలకు మాత్రం 470 పౌండ్ల కొత్త రాయితీని బడ్జెట్‌లో చేర్చినట్లు తెలుస్తుంది .
అయితే అంతర్జాతీయ విద్యార్ధులకు మాత్రం ఇది 300 పౌండ్ల నుంచి 470 పౌండ్లకు పెరిగింది. ఐహెచ్ఎస్‌ను యూకే ప్రభుత్వం ఏప్రిల్ 2015లో ప్రవేశపెట్టింది.2018 డిసెంబర్ వరకు దీనిని ఏడాదికి 200 పౌండ్ల నుంచి 400 పౌండ్ల వరకు పెంచుతూ వచ్చారు. ఐహెచ్ఎస్‌కు అదనపు నిధులను పెంచేందుకు గాను ఆరు నెలలకు పైబడి వర్క్, స్టడీ, ఫ్యామిలీ వీసాలపై రుసుమును విధిస్తున్నారు.