సాయం పేరుతో పిలిచి మహిళ పై అత్యాచారం..7 ఏళ్ల జైలు శిక్ష

-

సాయం పేరుతో మహిళ ను పిలిచి అత్యాచారం జరిపిన కేసుకు సంబంధించి భారత సంతతికి చెందిన వ్యక్తికి అమెరికా కోర్టు 7 సంవత్సరాల జీతాలు శిక్ష విధించినట్లు తెలుస్తుంది. అశోక్ సింగ్ 2015 డిసెంబర్ లో ఒక మహిళ ను అపార్ట్ మెంట్ బేస్ మెంట్ లో ఉండటానికి సహాయం చేసి,అనంతరం ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. అమెరికా లోని పెన్సిల్వేనియా లో నివసిస్తున్న 59 ఏళ్ల అశోక్ సింగ్ అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదురుకొంటున్నారు. సదరు మహిళ అశోక్ ను క్వీన్స్ లోని ఒక ఆలయంలో కలుసుకున్నారు. అయితే ఆ సమయంలో తాను ఉండటానికి ఏదైనా స్థలం చూపించమని ఆమె అడగటంతో సరేనన్నాడు. ఈ క్రమంలో ఒకరికొకరు ఫోన్ నెంబర్లను ఇచ్చిపుచ్చుకోవడం తో నాలుగు రోజుల తరువాత సదరు మహిళ కు ఫోన్ చేసి ఒక అపార్ట్‌మెంట్ దొరికిందని, వెంటనే షిఫ్ట్ అవ్వాలంటూ ఆ మహిళకు చెప్పాడు. ఆమె అద్దె ఇంట్లోకి వెళ్లేందుకు అశోక్ సాయం కూడా చేశాడు. ఆ తర్వాత వైన్, ఆహారం కోసం స్థానిక కిరాణా స్టోర్‌కు వెళ్లి తిరిగి ఆమె దగ్గరకు వచ్చిన అశోక్ బాధితురాలికి వైన్ ఇవ్వగా, దానికి ఆమె తిరస్కరించింది.

ఇక దానితో ఆగ్రహించిన అశోక్ ఆమెపై అత్యాచారం చేసినట్లు ఆమె ఆరోపిస్తుంది. అయితే ఆ తరువాత ఆటను నిద్రలోకి జారుకోటం తో బాధితురాలు అక్కడ నుంచి తప్పించుకొని పోలీసులకు సమాచారం ఇవ్వడం తో అతడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ కేసు అమెరికా కోర్టు లో విచారణకు రాగా కోర్టు సదరు అశోక్ కు 7 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news