
ప్రముఖ నటి.. తెలుగు అభిమానుల అభిమాన నటి జెనీలియా తెలుగులో ఢీ, బొమ్మరిల్లు వంటి సినిమాలతో మంచి అభిమానాన్ని సంపాదించుకుంది. ఆమె ఆపై బాలీవుడ్ నటుడు రీతేష్ దేశముఖ్ ను పెళ్లి చేసుకుంది. అప్పటినుండి సినిమాలకు నో చెప్పేసింది. కానీ అభిమానులకు నిత్యం తన సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందుబాటులో ఉంటుంది. అభిమానులతో తన విషయాలు పంచుకుంటూ ఉంటుంది. అయితే తాజాగా ఆమె ఓ మంచి కార్యాన్ని తలపెట్టింది.
వైద్యుల దినోత్సవం సందర్భంగా ఓ గొప్ప నిర్ణయం తీసుకుంది. ఆమెతో పాటు ఆమె భర్త రీతేష్ దేశముఖ్ కూడా ఈ నిర్ణయంలో పాలు పంచుకున్నాడు. ఇద్దరు తమ అవయవాలను దానం చేస్తునట్టుగా ప్రకటించారు. ఈ సందర్భంగా జెనీలియా తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ ఈ విషయాన్ని తెలియజేసింది. అవయవ దానం చేస్తున్నందుకు తనకు ఎంతగానో సంతోషంగా ఉందని అవయవ దానం చేసేందుకు ప్రోత్సాహించిన డాక్టర్ నోజర్ కు నా ధన్యవాదాలు అంటూ తన పోస్ట్ లో పేర్కొంది. ఈ పోస్ట్ చేసిన కొంత సేపటికే అభిమానులు ఆమె పై ప్రశంసల జల్లు కురిపించారు.