యూపీలో రోడ్డు ప్రమాదం.. 17 మంది దుర్మరణం

యూపీ: కన్పూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సచ్చేందిలో ఆటోను ఢీకొన్న బస్సు.. 17 మంది దుర్మరణం చెందారు. మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. బస్సు లక్నో నుంచి ఢిల్లీ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 25 మందికి మందిపైగా ప్రయాణికులు ఉన్నట్లు గుర్తించారు. డ్రైవర్ మద్యం మత్తే ప్రమాదానికి కారణమా అనే కోణంలో విచారణ చేపట్టారు. ప్రమాదం గురించి తెలుసుకున్న ప్రధాని మోదీ, యూపీ సీఎ యోగి ఆదిత్యనాథ్, స్థానిక ఎమ్మెల్యే అభిజీత్ సంగ విచారం వ్యక్తం చేశారు. బాధితులకు ప్రధాని మోదీ ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. మృతులకు రూ. 2లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.