SBI వినియోగదారులకు అలర్ట్: ఆధార్ తో పాన్ లింక్ ఆఖరి తేదీ వచ్చేసింది.. లింక్ చేసుకోవడానికి ఏం చేయాలంటే,

-

SBI వినియోగదారులందరూ తమ ఆధార్ తో పాన్ లింక్ (aadhar pan card link) చేసుకోవాల్సిందే. ఈ మేరకు ఆఖరు తేదీ వచ్చేసింది. జూన్ 30వ తేదీలోపు ఆధార్ కార్డుకి పాన్ కార్డ్ లింక్ చేయాలి. లేదంటే భవిష్యత్తు బ్యాంకు లావాదేవీల్లో అసౌకర్యం ఉంటుంది. మునుపటిలా లావాదేవీలు జరపలేరు. ఈ మేరకు SBI బ్యాంక్, ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా సమాచారాన్ని తెలియజేసింది. జూన్ 30వ తేదీలోఘా ఆధార్ కార్డుకి పాన్ కార్డ్ లింక్ చేసుకోవాలని లేదంటే లావాదేవీలు ఆగిపోతాయని తెలిపింది.

ఆధార్ తో పాన్ లింక్ | aadhar pan card link

ఆధార్ కార్డుకి పాన్ కార్డ్ లింక్ చేయడానికి ఎక్కడి నుండైనా చేయవచ్చు. దానికంటే ముందు మీ బ్యాంకు అకౌంట్ కి ఆధార్ లింక్ అయిందా లేదా తెలుసుకోవాలి. అదెలాగో ఇక్కడ చూద్దాం.

Step 1: దానికోసం uidai.gov.in . సైట్ సందర్శించండి.
Step 2: Check Aadhaar/Bank Account Linking Statu పైన క్లిక్ చేయండి.
Step 3: మీ 12అంకెల ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి.
Step 4: సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి ఓటీపీ పైన క్లిక్ చేయండి.
Step 5: ఇప్పుడు మీ మొబైల్ నంబరుకి ఓటీపీ వస్తుంది.
Step 6: ఆ ఓటీపీ నంబర్ ఎంటర్ చేసి క్లిక్ చేస్తే మీ ఆధార్ నంబరు, బ్యాంక్ అకౌంట్ తో లింక్ అయ్యిందా లేదా అనేది తెలిసిపోతుంది.

పాన్ కార్డుకి ఆధార్ లింక్ చేయాలంటే:

Step 1: incometaxindiaefiling.gov.in అనే సైటులోకి లాగిన్ అవ్వాలి.

Step 2: పాన్ నంబర్ యూజర్ ఐడి పెట్టుకుని రిజిస్టర్ అవ్వండి.
Step 3: యూజర్ ఐడి, పాస్వర్డ్ ఇంకా పుట్టిన తేదీ వివరాలు ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.
Step 4: ఇప్పుడు ఒక పాప్ అప్ విండో ఓపెన్ అవుతుంది. ఒకవేళ అది ఓపెన్ అవకపోతే ప్రొఫైల్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి, మెనూ బార్ మీద క్లిక్ చేసే “లింక్ ఆధార్” అనే ఆప్షన్ కనిపిస్తుంది.
Step 5: పాన్ కార్డు ప్రకారం అన్ని వివరాలని అందించాలి.
Step 6: పాన్ వివరాలు, ఆధార్ వివరాలు చెక్ చేసుకోండి.
Step 7: రెండు వివరాలు ఒకేలా ఉంటే ఆధార్ నంబర్ ఎంటర్ చేసి లింక్ అన్న చోట క్లిక్ చేయాలి.
Step 8: పాన్ తో ఆధార్ లింక్ అయినట్టుగా పాప్ అప్ మెసేజ్ వస్తుంది. అంతే.

Read more RELATED
Recommended to you

Latest news