పెళ్లి పీటలెక్కనున్న రాకింగ్ రాకేశ్-సుజాత.. డేట్ ఫిక్స్

-

రాకింగ్ రాకేశ్-జోర్దార్ సుజాత బుల్లితెరపై ఈ జోడీ చాలా ఫేమస్.  గత కొంతకాలంగా వీళ్లిద్దరు ప్రేమలో మునిగి తేలుతున్నట్లు వార్తలొస్తున్న విషయం తెలిసిందే.  అయితే వీళ్లు తెరపై కనువిందు చేయడమే తప్ప తెర వెనక స్టోరీని మాత్రం నెటిజన్లకు క్లారిటీ ఇవ్వలేదు.

చాలా రోజుల నుంచి వీళ్లిద్దరు పెళ్లి చేసుకుంటారు అని వస్తున్న వార్తలపై నెటిజన్లకు క్లారిటీ లేదు. 

అయితే తాజాగా ఈ జంట తమ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తమ బంధాన్ని మరో స్టేజ్ కి తీసుకెళ్లేందుకు రెడీగా ఉన్నట్లు ప్రకటించింది. దీనికి ఇరువురు కుటుంబ సభ్యులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిపారు సుజాత-రాకేశ్. త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నామని శుభవార్త చెప్పారు.

జోర్దార్ సుజాత తన యూట్యూబ్ ఛానెల్ అయిన సూపర్ సుజాత ఛానెల్ లో ఈ గుడ్ న్యూస్ ను తన సబ్ స్క్రైబర్లతో పాటు అభిమానులతో షేర్ చేసుకుంది. ఈ వీడియోలో రాకింగ్ రాకేశ్ తో తన పరిచయం.. ఆ తర్వాత స్నేహం.. అది ప్రేమకు దారి తీయడం.. ఇరు కుటుంబాలు కలుసుకోవడం.. చివరకు వీళ్ల బంధం పెళ్లి వరకు రావడం గురించి.. అంతా వివరించింది.

ఈనెల చివర్లో రాకేశ్-సుజాత నిశ్చితార్థం ఉండనుంది. అదే రోజున లగ్నపత్రిక రాసుకుని పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకుంటారట. ఈ గుడ్ న్యూస్ విని రాకేశ్ సుజాత ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. ఇద్దరికి తమ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. https://www.youtube.com/watch?v=4w3MPiGdKmE&ab_channel=SuperSujatha

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version