ఏపీ మహిళలకు శుభవార్త.. రూ.2 లక్షలు ప్రోత్సాహం..

-

డ్వాక్రా మహిళలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. డ్వాక్రా మహిళల వ్యాపారాభివృద్ధికి గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ(సెర్ప్) అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో చేపడుతున్న జాతీయ గ్రామీణ జీవనోపాధుల మిషన్ (ఎన్ఆర్ఎల్ఎమ్) కింద ఆర్థిక భరోసా కల్పించి మహిళల అభివృద్ధికి చేయూత ఇవ్వనున్నారు. ఇప్పటికే డ్వాక్రా సంఘాల్లో చిన్న తరహా వ్యాపారాలు చేసుకుంటున్న మహిళల్ని గుర్తించి ప్రోత్సహాన్ని అందించనున్నారు. వచ్చే నెల నుంచి అమల్లోకి తెచ్చేలా కార్యాచరణపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రంలోని ప్రతి డ్వాక్రా సంఘం నుంచి కనీసం ఇద్దరు మహిళా వ్యాపారులను గుర్తిస్తారు. వారి వ్యాపారాభివృద్ధికి అవసరమైన వివరాలు నమోదు చేసుకుంటారు.

Read all Latest Updates on and about 60 lac dwakra groups benefited

ఇందుకుగాను రూ.75 వేల నుంచి రూ.2 లక్షల వరకు రుణంగా ఇస్తారు. ఇప్పటికే ఆయా సంఘాల సభ్యులు రుణం తీసుకొని ఉన్నా అదనంగా అవసరమైన మొత్తాన్ని ఎన్ఆర్ఎల్ఎమ్ అందించడం ద్వారా ఆ మహిళల ఆదాయాన్ని పెంచనున్నారు. వీరు చేస్తున్న వ్యాపారం, అందులో పురోగతిని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ఉద్యమి’ యాప్‌లో నమోదు చేస్తారు. ఏడాది పాటు వీరి కార్యకలాపాలను సెర్ప్‌ అధికారులు పర్యవేక్షిస్తారు. ఎప్పటికప్పుడు అవసరమైన చేయూత అందిస్తారు. తగిన మార్గనిర్దేశం చేసి ఆర్థికాభివృద్ధికి సహకరిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news