న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్ లో రోహిత్ దూరం

-

భార‌త ఆట‌గాళ్లను ఇటీవ‌ల వేధిస్తున్న ప్ర‌ధాన స‌మ‌స్య బ‌యో బ‌బుల్. చాలా రోజుల నుంచి టీమిండియా ఆట‌గాళ్లు బ‌యో బబుల్ ఉంటున్నారు. దీంతో ఆట‌గాళ్లు మానసికంగా, శారీరంగా అలసి పోతున్నారు. అయితే టీమిండియా స్టార్ ఓపెన‌ర్ టీట్వంటి జ‌ట్టు కెప్టెన్ రోహిత్ శ‌ర్మ కూడా చాలా రోజుల నుంచి వ‌రుస‌గా బ‌యో బబుల్ ఉంటున్నాడు.

దీంతో తీవ్ర ఒత్తిడి కి గురి అవుతున్నాడు. అందుకే స్వ దేశంలో న్యూజిలాండ్ తో జ‌రిగే టెస్ట్ సిరిస్ రోహిత్ దూరంగా ఉంటున్నాడ‌ని తెలుస్తుంది. కొద్ది రోజుల పాటు బ‌యో బ‌బుల్ నుంచి విశ్రాంతి తీసుకోవాల‌ని రోహిత్ నిర్ణ‌యం తీసుక‌న్న‌ట్టు తెలుస్తుంది. దీనికి బీసీసీఐ కూడా సానుకూలంగా స్పందించిన‌ట్టు తెలుస్తుంది. దీని పై బీసీసీఐ త్వ‌ర‌లో అధికారికంగా ప్ర‌క‌టించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. అలాగే విరాట్ కోహ్లి కూడా మొద‌టి టెస్ట్ కు విశ్రాంతి తీసుకుంటున్నట్టు స‌మాచారం.

 

అలాగే టీమిండియా ఆట‌గాళ్లు రిష‌భ్ పంత్, బుమ్రా, మహ్మ‌ద్ ష‌మీ, శార్దుల్ కూడా సుదీర్ఢంగా ఉంటున్న‌ బ‌యో బ‌బుల్ నుంచి విశ్రాంతి తీసుకుంటున్న‌ట్టు తెలుస్తుంది. అయితే సీనియ‌ర్లు అంద‌రూ కూడా విశ్రాంతి తీసుకోవ‌డం తో న్యూజిలాండ్ తో జ‌ర‌గ‌నున్న టెస్ట్ సిరిస్ కు జూనియ‌ర్ ఆట‌గాళ్ల తో టీమిండియా రంగం లోకి దిగ‌నుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version